మహేష్ వైఫ్ తో మరదలికి గొడవా?
`బిగ్ బాస్ సీజన్` 18తో శిల్పా శిర్కోద్కర్ పేరు ట్రెండింగ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ మరదలిగా శిల్పా శిరోద్కర్ సుపరిచితమే.
`బిగ్ బాస్ సీజన్` 18తో శిల్పా శిర్కోద్కర్ పేరు ట్రెండింగ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ మరదలిగా శిల్పా శిరోద్కర్ సుపరిచితమే. కానీ హిందీ సినిమాలతో యాక్టివ్ గా లేకపోవడంతో అంతా శిల్పా పేరు మర్చిపోయారు. స్వయానా నమ్రత శిరోద్కర్ సిస్టర్ అయినా ఆమె హైదరాబాద్ రావడం వంటివి కూడా పెద్దగా జరగదు. చాలా కాలంగా సినిమాలు కూడా చేయకపోవడంతో పాటు సోషల్ మీడియాలో కూడా ఆమె పెద్దగా యాక్టిగా ఉండదు.
దీంతో శిల్పా శిరోద్కర్ ని అంతా మర్చిపోయారు. అయితే సీజన్ 18తో చాలా కాలానాకి ఆమె పేరు తెరపైకి వచ్చింది. ప్రత్యేకంగా టాలీవుడ్ మీడియాలో సెంట్రాఫ్ ది అట్రాక్షన్ అయింది. మహేష్ నమ్రతని పెళ్లి చేసుకోవడానికి ముందే ఆమె సినిమాలకు దూరమైంది. మహేష్ పెళ్లి 2005లో అయితే శిల్పా సినిమాలకు 2000లోనే దూరమైంది. అప్పటి నుంచి ఆమె జాడ మీడియాలోనూ పెద్దగా లేదు. మహేష్ ఇంట జరిగే వేడుకల్లోనే ఆమె పాల్గొన్న సందర్భం చోటు చేసుకోలేదు.
తాజాగా ఇప్పుడు శిల్పా శిరోద్కర్ పేరు వైరల్ అవ్వడంతో అంతా మహేష్ మరదలంటూ మాట్లాడుకోవడం మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 18 సందర్భంగా సిస్టర్ నమ్రతా శిరోద్కర్ తో తనకెలాంటి బాండింగ్ ఉండేదన్నది గుర్తు చేసుకుంది. అనురాగ్ కశ్యప్ బిగ్ బాస్ లో కనిపించినప్పుడు శిల్కా శిర్కోద్కర్ కి ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. దౌత్యవేత్త అనే ట్యాగ్ ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. దానికి ఆమె పోటీదారులు ఎవరూ తన కుటుంబం కాదని... హౌస్ లో అందరూ ఇష్టపడే అమ్మాయినని..చిన్న పిల్లని అంటుంది. అదే సమయంలో నమ్రత గురించి ప్రస్తా వించింది. బిగ్ బాస్ హౌస్‌కి రాకముందు తాను నమ్రతతో గొడవ పడ్డానని సరదాగా వ్యాఖ్యానించింది.
1990 దశకంలో బాలీవుడ్‌లో గ్లామర్ క్వీన్‌గా పేరుతెచ్చుకున్నది శిల్పా శిరోద్కర్. అంఖే, గోపీకిషన్, బందీష్, మృత్య్‌దండ్, హమ్, త్రినేతతో పాటు హిందీలో వంద వరకు సినిమాలు చేసింది. ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించింది. 2000 సంవత్సరంలో వచ్చిన గజగామిని తర్వాత బాలీవుడ్‌కు దూరమైంది. వరుస పరాజయాలతో ఆమె కెరీర్ ముగిసింది.
ఆ తర్వాత కొన్ని టీవీ సీరియల్స్ చేసింది. మోహన్‌బాబు హీరోగా నటించిన `బ్రహ్మ` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగార్జునతో హిందీలో ఖుదాగవా సినిమాలోనూ నటించింది. ఈ సినిమా తెలుగులోకి కొండవీటి సింహాం పేరుతో డబ్ అయ్యింది.