విమర్శకులపై శిల్పాశెట్టి సౌండ్ లేని రియాక్షన్!
నా బ్యూటీ సీక్రెట్ ఏంటని అడిగారు. అందుకే నేను విమర్శల్ని పట్టించుకోను. ఇక ట్రోలర్లుని అలాగే భావిస్తా. నా దృష్టిలో వాళ్లిద్దరూ సమానమే.
సాగరకన్య శిల్పాశెట్టి పై విమర్శలు.. నెట్టింట ట్రోలింగ్ కొత్తేం కాదు. వివిధ అంశాలపై అమ్మడిపై ట్రోలింగ్ జరిగిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఇలాంటి ట్రోలింగ్ లను శిల్పాశెట్టి పట్టించుకోరు. చివరికి భర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో ఇరుక్కున్న సమయంలో ఎదురైన విమర్శలపై మాత్రమే మాట్లాడింది తప్ప ట్రోలింగ్ గురించి మాత్రం ఎలాంటి కామెంట్లు చేయలేదు. అయితే తాజాగా ఈ అంశంపై శిల్పా శెట్టి తొలిసారి నోరు విప్పింది.
నేను మొదటిసారి తల్లి అయ్యాక..ప్రసవం అనంతరం విమర్శించారు. బరువు పెగరడంపై ఇష్టాన సారం కామెంట్లు పెట్టారు. బిడ్డ పుట్టిన 8 నెలల వరకూ బరువు పెరుగుతూనే ఉన్నా. ప్రసవం తర్వాత బరువు అవుతాం అన్న విషయాన్ని కూడా కొందరు గ్రహించలేకపోయారు. వ్యక్తిగతంగా మనసు గాయపడేలా విమర్శించారు. అలాగని..వాళ్లు విమర్శించారని పట్టించుకుని బరువు తగ్గలేదు.
నేను నిర్ణయించుకున్న తర్వాత మూడు నెలల్లో ఫిట్ గా మారాను. అలా గ్లామరస్ గా మారిన తర్వాత విమర్శించిన వాళ్లే అందంగా ఉన్నానని ఆకాశానికి ఎత్తేస్తారు. నా బ్యూటీ సీక్రెట్ ఏంటని అడిగారు. అందుకే నేను విమర్శల్ని పట్టించుకోను. ఇక ట్రోలర్లుని అలాగే భావిస్తా. నా దృష్టిలో వాళ్లిద్దరూ సమానమే. వాళ్లు నా గురించి కూడా ఆలోచిస్తున్నందకు సంతోషిస్తున్నా' అని అన్నారు. మొత్తానికి శిల్పా శెట్టి కూల్ గా విమర్శలన్నింటికి చెక్ పెట్టింది.
ఇక రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో ఇరుక్కుని బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. పేరున్న బిజినెస్ మ్యాన్ గా ఉన్న కుంద్రాని ఈ కేసు ఓ కుదుపు కుదిపేసింది. త్వరలోనే రాజ్ కుంద్రా కూడా నటుడిగా తెరంగేట్రం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈదంపతులకు ఇద్దరు పిల్లలు కలరు. ఇక శిల్పా శెట్టి ఇన్ స్టా క్వీన్ వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. అమ్మడు ఇన్ స్టా ద్వారానే లక్షలు సంపాదిస్తోంది. ఫిట్ నెస్ వీడియోలతోనే బోలడంత పాపులారిటీ సంపాదించింది.