గోదారి అందాలు చూసి కేరళలో మాఊళ్లో ఉన్నట్లు ఫీలయ్యా!
`దసరా`తో విలన్ గా ఫేమస్ అయిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో సుపరిచితమే.
`దసరా`తో విలన్ గా ఫేమస్ అయిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో సుపరిచితమే. తొలి సినిమా సక్సెస్ అవ్వడంతో షైన్ టాక్ చాకో కి మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా అతడి నేచురల్ పెర్పార్మెన్స్ తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ విజయం తెలుగులో మరిన్ని అవకాశాలు తెచ్చి పెట్టింది. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న` దేవర`లో నటిస్తున్నాడు. ఇందులోనూ అతడి పాత్ర అత్యంత కీలకమైంది.
తాజాగా ఓ ఇంటర్వ్యలో అతడి కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. `ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చాను. పదేళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసా. అలా పనిచేస్తూనే నటినటులతో పరిచయాలు పెంచుకుని కెమెరా ముందు వాళ్ల నటన గమనించే వాడిని. జూనియర్ ఆర్టిస్ట్ ఎవరైనా రాకపోతే ఆ వేషం నేను వేసేవాడిని. అలా కొన్ని పాత్రల్లో తెరమీద చూసిన దర్శకుడు కమల్ నన్ను ప్రోత్సహించారు.
2011 అలో `గడ్డమ్మ` అనే సినిమాలో హీరోగా నటించా. ఆ తర్వాత వివిధ పాత్రలు పోషించా. అక్కడ నుంచి ఇతర భాషల్లో అవకాశాలు వచ్చాయి. సినిమాలంటే చిన్న నాటి నుంచి ఆసక్తి. కానీ మా అమ్మ నేను ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఆశపడేది. నాకు చిన్న నాటి నుంచి మోహన్ లాల్, మమ్ముట్టి కి వీరాభిమానిని. వాళ్ల సినిమాలు తొలి షో చూసేవాడిని. డిగ్రీ పూర్తి చేసాక ఇంట్లో వాళ్లకు చెప్పి ఇండస్ట్రీకి వచ్చేసాను.
దసరా సమయంలో భాష రాక బాగా ఇబ్బంది పడ్డా. `రంగబలి` షూటింగ్ ఆంధ్రాలో జరిగింది. గోదావరి జిల్లాలకు వె ళ్లినప్పుడు నాకు మాఊరు వెళ్లినట్లే అనిపించింది. అక్కడ గ్రీనరీ, పచ్చని పొలాలు చూసే మా ఊళ్లో ఉన్నానా? అనిపించింది. కేరళలోని మలప్పురం దగ్గరున్న పొన్నని` అని అన్నారు.