టాలీవుడ్ క్లాసిక్ డైరెక్ట‌ర్ ఏమైన‌ట్లు?

టాలీవుడ్ లో స‌రైన క్లాసిక్ డైరెక్ట‌ర్లు లేరు అనుకుంటోన్న స‌మ‌యంలో శివ నిర్వాణ ఆ లోటును తీర్చిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-02-27 22:30 GMT

టాలీవుడ్ లో స‌రైన క్లాసిక్ డైరెక్ట‌ర్లు లేరు అనుకుంటోన్న స‌మ‌యంలో శివ నిర్వాణ ఆ లోటును తీర్చిన సంగ‌తి తెలిసిందే. `నిన్ను కోరి`తో ఎంట్రీ ఇచ్చిన శివ అటుపై `మ‌జిలీ`తో మ‌రో క్లాసిక్ హిట్ ఇచ్చాడు. రెండు క్లాసిక్ ల‌వ్ స్టోరీలు స‌క్సెస్ అవ్వ‌డంతో? ఒక్క‌సారిగా ట‌ర్న్ తీసుకుని `ట‌క్ జ‌గ‌దీష్` అనే యాక్ష‌న్ జోన‌ర్ ని ట‌చ్ చేసి చేతులు కాల్చుకున్నాడు. దీంతో మ‌ళ్లీ `ఖుషీ` అంటూ త‌న జాన‌ర్లోకి వ‌చ్చే ప్ర‌య‌త్నం చేసాడు.

అయితే ఈ సినిమా అంచ‌నాలను మాత్రం అందుకోలేదు. మ్యూజిక‌ల్ గా స‌క్సెస్ అయిన బ‌ల‌మైన ల‌వ్ స్టోరీ కాక‌పోవ‌డంతో అంత‌గా ఎక్క‌లేదు. అలాగ‌ని నిర్మాత‌కు న‌ష్టాలు రాలేదు. పెట్టుబ‌డి మాత్రం రిక‌వ‌రీ చేసింది. ఆ సినిమా విడుద‌లై ఏడాదిన్న‌ర‌వుతుంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇంత‌వ‌ర‌కూ కొత్త సినిమా అప్ డేట్ రాలేదు. దీంతో శివ ఏం చేస్తున్న‌ట్లు? అన్న డిస్క‌ష‌న్ ఫిల్మ్ వ‌ర్గాల్లో వ‌స్తోంది. స్టోరీ రాయ‌డం కోసం మ‌రీ ఇంత స‌మ‌యం తీసుకోడు అత‌ను.

అత‌డి వ‌ద్ద స్టోరీ ల బ్యాంక్ ఉంద‌ని తొలి సినిమా స‌మ‌యంలోనే రివీల్ చేసాడు. వాటికి మెరుగులు దిద్దితే చాలు మంచి ల‌వ్ స్టోరీలుగా రూపాంత‌రం చెందుతాయ‌ని తెలిపాడు. వాటిలో ఓ స్టోరీకి మెరుగులు దిద్దినా? ఇప్ప‌టికి ఓ సినిమా లైన్ లో ఉండాలి. కానీ అలా జ‌ర‌గ‌లేదు. దీంతో హీరోలు ఖాళీగా లేక‌పోవ‌డం వ‌ల్ల కొత్త సినిమా ప‌ట్టాలెక్కించ‌లేక‌పోతున్నాడా? లేక ప్రెష్ స్టోరీ అన్వేష‌ణ‌లో ప‌డి డిలే చేస్తున్నాడా? అన్న‌ది అర్దం కాని ప‌రిస్థితి.

శివ తో సినిమా చేయ‌డానికి యంగ్ హీరోలెవ్వ‌రూ వెన‌క‌డుగు వేయ‌రు. అత‌డికి ఉన్న ట్రాక్ రికార్డు అలాంటింది. ఈ నేప‌థ్యంలో శివ మౌనం వెనుక ఇంద‌కేదైనా పెద్ద ప్లానింగ్ ఉందా? అన్న‌ది తెలియాలి. అస‌లే డైరెక్ట‌ర్లు అతా పాన్ ఇండియా మోజులో ఉన్నారు. మ‌రి ఒక‌వేళ శివ కూడా అలాంటి స్క్రిప్ట్ ప‌నుల్లో బిజీగా మారాడా? అన్న‌ది తెలియాలి.

Tags:    

Similar News