తెలుగులో డైలాగ్ చెప్పా.. వెంటనే వర్షం: 'పెద్ది' శివరాజ్

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ పెద్ది మూవీలో కన్నడ ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-04-16 05:14 GMT
తెలుగులో డైలాగ్ చెప్పా.. వెంటనే వర్షం: పెద్ది శివరాజ్

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ పెద్ది మూవీలో కన్నడ ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వరుస షెడ్యూళ్లతో చిత్రీకరణను జెట్ స్పీడ్ లో పూర్తి చేస్తున్నట్లు కనిపిస్తున్నారు మేకర్స్.

అమెరికాలో చికిత్స చేయించుకుని కోలుకున్న తర్వాత ఇండియాకు వచ్చిన శివరాజ్.. రీసెంట్ గా షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ శివార్లలో చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తోంది. అయితే తన మరో మూవీ 45 ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పెద్ది మూవీ గురించి మాట్లాడారు శివరాజ్.

కొన్ని రోజుల క్రితం పెద్ది మూవీ షూటింగ్ లో పాల్గొనున్నానని శివరాజ్ కుమార్ తెలిపారు. రెండు రోజుల పాటు సెట్స్ కు వెళ్లానని చెప్పారు. ఆ రెండు రోజులు కూడా చాలా సరదాగా అనిపించిందని వెల్లడించారు. ముఖ్యంగా డైరెక్టర్ బుచ్చిబాబు మంచి వ్యక్తిని, తన షాట్ ను అభినందించారని చెప్పిన ఆయన.. ఏ యాక్టర్ కు అయినా అదే కావాలని అన్నారు.

అదే సమయంలో రామ్ చరణ్ బిహేవియర్ వెరీ గుడ్ అంటూ కొనియాడారు శివరాజ్ కుమార్. తాను పెద్ది మూవీ కోసం తొలిసారి తెలుగులో డైలాగ్ చెప్పానని వెల్లడించారు. తెలుగులో డైలాగ్ చెప్పడం కంప్లీట్ అయిన వెంటనే వర్షం పడిందని గుర్తు చేసుకున్నారు. ప్రకృతి తనకు అలా ఆహ్వానం పలికిందని చెప్పారు.

పెద్దిలో తన రోల్ చాలా స్పెషల్ అని అన్నారు శివరాజ్ కుమార్. తన పాత్ర మెస్మరైజ్ చేస్తుందని తెలిపారు. బుచ్చిబాబు స్క్రిప్ట్ బాగా నచ్చిందని చెప్పారు. మూవీ టీమ్ అంతా సపోర్ట్ ఇస్తున్నారని, ఫ్రెండ్లీగా ఉంటారని పేర్కొన్నారు. ఫుడ్ కూడా బాగుందని, ముఖ్యంగా బిర్యానీ నచ్చిందని అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక సినిమా విషయానికొస్తే.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు.. భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. బాలీవుడ్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన సినిమా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

Tags:    

Similar News