గుడ్ న్యూస్.. సూపర్ స్టార్ క్యాన్సర్ ఫ్రీ
ఈ విషయాన్ని స్వయంగా ఆయన భార్య సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కన్నడ ప్రేక్షకులతో పాటు సౌత్ ఇండియాలోని అన్ని భాషల సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు అనే వార్తలు ఆయన ఫ్యాన్స్‌తో పాటు అందరికీ ఆందోళన కలిగించాయి. గత కొన్ని నెలలుగా ఆయన ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు, ప్రత్యేక సేవా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనలు చేస్తూ శివ రాజ్ కుమార్ ఆరోగ్యం కోసం దేవుడిని వేడుకున్నారు. ఫ్యాన్స్ ప్రార్థనలు, కుటుంబ సభ్యుల ప్రార్థనలు ఫలించాయి. చాలా అరుదుగా మాత్రమే జరిగే విధంగా శివ రాజ్ కుమార్ క్యాన్సర్ ఫ్రీ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన భార్య సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ గత ఏడాది చివరి వరకు సినిమాల్లోనే నటిస్తూ వచ్చారు. ఆయన అనారోగ్య సమస్య గురించి బయటకు చెప్పకుండా ఉంచారు. చివరకు ఆయన విదేశాలకు చికిత్స కోసం వెళ్లిన సమయంలో అసలు విషయాన్ని వెల్లడించారు. మీడియాలో పుకార్లు షికార్లు చేయకుండా మొదటి నుంచి జాగ్రత్తగా ఉంటూ వచ్చిన శివ రాజ్ కుమార్ ఫ్యామిలీ చివరకు క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు ప్రకటించారు. అయితే స్టార్టింగ్ స్టేజ్‌లోనే క్యాన్సర్ ఉన్న కారణంగా సమస్య లేకుండా బయటకు వస్తాను అంటూ సన్నిహితులతో శివ రాజ్ కుమార్ చాలా నమ్మకంగా చెప్పారట. అన్నట్లుగానే ఆయన క్యాన్సర్ బారి నుంచి పూర్తిగా బయట పడ్డారు.
తెలుగులో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో పాటు ఎన్నో డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన శివ రాజ్ కుమార్ ఇటీవల తమిళ్ మూవీ జైలర్‌లో నటించి సూపర్ హిట్ దక్కించుకున్నాడు. తక్కువ సమయం కనిపించినా జైలర్‌లో శివరాజ్ కుమార్ పాత్రకు మంచి వెయిట్ ఉంటుంది. అంతే కాకుండా ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలకు మంచి స్పందన వచ్చింది. ఇక 2025లో శివ రాజ్ కుమార్ నటించాల్సిన సినిమాలు, ఆయన ఇప్పటికే నటించిన సినిమాలు పలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
ఇటీవల శివన్న సోదరుడు కన్నడ సినీ ప్రేక్షకుల ఆరాధ్య దైవంగా భావించే పునీత్ రాజ్ కుమార్ మృతి చెందిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. శివన్న ఆరోగ్యం విషయంలో నిన్న మొన్నటి వరకు ఉన్న ఆందోళనను ఆయన భార్య గీత సోషల్ మీడియా పోస్ట్‌తో పూర్తిగా తొలగి పోయింది. శివన్న మాట్లాడిన వీడియోను షేర్ చేయడం ద్వారా గీత ఫ్యాన్స్‌కి కొత్త ఏడాదిలో సూపర్ న్యూస్‌ను చెప్పారు. ముందు ముందు ఆయన నుంచి మరిన్ని సినిమాలు వస్తాయని, కనీసం రెండు మూడు నెలల విశ్రాంతి తర్వాత షూటింగ్స్‌కు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.