పల్లవి ప్రశాంత్ తో శివాజి.. అతనిలో హీరోని గుర్తించా..!
పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తర్వాత శివాజీ అతని గురించి పట్టించుకోలేదని అతనిపై కామెంట్స్ చేశారు. దానికి వివరణ ఇస్తూ శివాజీ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు.
బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ జైలు నుంచి బయటకు వచ్చాడు. బిగ్ బాస్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ తర్వాత పోలీసులు చెప్పినా పట్టించుకోకుండా ర్యాలీ చేసినందుకు పలు సెకన్ల కింద పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు. 3 రోజులు కస్టడీలో ఉంచుకుని రిలీజ్ చేశారు. అయితే బయటకు వచ్చిన ప్రశాంత్ శివాజీని కలిశాడు. బిగ్ బాస్ హౌస్ లో శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ ముగ్గురు కలిసి ఆట ఆడారు.
పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తర్వాత శివాజీ అతని గురించి పట్టించుకోలేదని అతనిపై కామెంట్స్ చేశారు. దానికి వివరణ ఇస్తూ శివాజీ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఎవరికో నిరూపించడం కోసం తను చేయాల్సిన పనిలేదని వారి ఫ్యామిలీ మెంబర్స్ తో తాను టచ్ లోనే ఉన్నానని శివాజీ చెప్పారు. ఇక రిలీజైన పల్లవి ప్రశాంత్ ని కలిసిన శివాజీ కలిసి ఇన్ స్టాగ్రాం లో లైవ్ వీడియో చేశారు.
లైవ్ లో శివాజీ అన్న ఎక్కడ అని అడుగుతున్నారు నువ్వు చెప్పరా ప్రశాంత్ నేను ఎక్కడ ఉన్నానని అడిగితే.. ప్రశాంత్ దానికి ఆన్సర్ గా నా గుండెల్లో ఉన్నారని చెప్పాడు. అంతేకాదు కన్నడలో లూస్ మాద అనే హీరో ఉన్నాడు. ప్రశాంత్ ని చూస్తే తనకు అతనే గుర్తుకొచ్చాడని అన్నారు. ప్రశాంత్ లో ఒక హీరో ఉన్నాడు. నేను హౌస్ లో ఉన్నప్పుడు అదే చెప్పానని.. ఇప్పుడు అదే చెబుతున్నానని అన్నారు. ప్రశాంత్ లో ఉన్న ఆ హీరో బయటకు రావాలని అన్నారు.
వయసు ప్రభావం వల్ల గెలిచాను అనే ఆనందంలో ఫ్యాన్స్ ని కలవాలన్న ఉత్సాహంలో ఇది జరిగింది. వాటన్నిటికీ ప్రశాంత్ సరిదిద్దుకుంటాడు. అది మీరు చూస్తారని చెప్పారు శివాజీ. హౌస్ నుంచి బయటకు వచ్చాక ఎలా ఉంటుందో నాగార్జున గారు ముందే చెప్పారు. అది మాకు హెల్ప్ అవుతుంది. విన్నర్ గురించి కూడా రకరకాల కామెంట్స్ వచ్చాయి. విన్నర్ ని ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకునేది లేదని అన్నారు శివాజీ. ఈ లైవ్ లో యావర్ కూడా పాల్గొన్నాడు. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ ముగ్గురు కలిసి చిట్ చాట్ చేశారు. వీరితో పాటు నయనీ పావని, శుభ శ్రీ, తేజ కూడా పాల్గొన్నారు.