ఉప్పెన ఆఫర్ అందుకే వదులుకున్నా : శివానీ రాజశేఖర్
శివానీ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. శివానీ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉప్పెన ఆఫర్ తొలిగా తనను వరించిందని కానీ తాను తిరస్కరించానని తెలిపింది.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ని తెరకు పరిచయం చేస్తూ సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా ఉప్పెనతో కన్నడ బ్యూటీ కృతి శెట్టి కథానాయికగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారతదేశంలో డెబ్యూ హీరో నటించిన తొలి 100 కోట్ల క్లబ్ సినిమాగా రికార్డులకెక్కింది. అంతేకాదు.. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రం అవార్డును గెలుచుకుంది.
ఈ సినిమా తర్వాత కృతి శెట్టి కెరీర్ స్కై రేంజులోకి దూసుకెళ్లింది. అయితే ఇదే సినిమాలో నటించే అవకాశం తొలిగా ఎవరికి వచ్చిందో తెలుసా? .. ఆ ఛాన్స్ ఒక తెలుగమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లింది. కానీ తాను తిరస్కరించడంతో ఆ తర్వాత కన్నడ అమ్మాయి కృతి శెట్టిని ఈ లక్కీ ఛాన్స్ వరించింది. ఇంతకీ ఈ ఆఫర్ ని వదులుకున్న తెలుగమ్మాయి ఎవరు? అంటే.. జీవిత-రాజశేఖర్ దంపతుల పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్.
శివానీ రాజశేఖర్ కథానాయికగా కెరీర్ ప్రారంభించి చాలా కాలమే అయింది. కానీ ఆశించిన స్థాయి స్టార్ డమ్ ని అందుకోవడంలో తడబడింది. అయితే తనకంటూ కొన్ని పరిధులు, పరిమితులు ఉన్నాయని శివానీ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. శివానీ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉప్పెన ఆఫర్ తొలిగా తనను వరించిందని కానీ తాను తిరస్కరించానని తెలిపింది. అందులో అంతగా నచ్చనిది ఏం ఉంది? అని హోస్ట్ ప్రశ్నించగా, తనకు వినిపించిన కథ డ్రాఫ్ట్ లో బోల్డ్ సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయని, వాటిని తాను సౌకర్యంగా చేయగలనని అనుకోలేదని శివానీ రాజశేఖర్ వెల్లడించారు. తనకు వినిపించిన స్క్రిప్టు వేరు.. ఆ తర్వాత తీసిన స్క్రిప్టు వేరని కూడా తెలిపారు. అప్పటికి సౌకర్యంగా లేను. ఇప్పటికీ నేను ఈ లిప్ లాక్స్, ఇంటిమసీ చేయగలగాలంటే నన్ను నేను అడగాలి.. అని శివానీ అన్నారు. లవ్ మేకింగ్ సీన్లు, బోల్డ్ సీన్లు నేను చేయగలుగుతానో లేదో తెలీదు అని కూడా వ్యాఖ్యానించారు.
అయితే కృతి శెట్టి ఉప్పెన సినిమాలో పరిమితుల్లోనే నటించి మెప్పించారు. శివానీ చెప్పిన దాని ప్రకారం.. స్క్రిప్టు డ్రాఫ్ట్ మారాక అది డీసెంట్ గా కృతికి సహకరించింది. ఇక సుకుమార్ మార్క్ బోల్డ్ సీన్స్ లో నటించేందుకు శివానీ అప్పటికి సిద్ధంగా లేదని అర్థం చేసుకోవాలి. 100పర్సంట్ లవ్ లో తమన్నాతో బోల్డ్ సీన్స్ చేయించిన సుకుమార్, ఆ తర్వాత కుమారి 21ఎఫ్ లో హెబ్బా పటేల్ తో బోల్డ్ ప్రదర్శనను రాబట్టారు. ఆ ఇద్దరి కెరీర్ ఏ రేంజుకు ఎదిగిందో తెలిసిందే. కానీ శివానీ తో బుచ్చిబాబు-సుకుమార్ బృందం బోల్డ్ సీన్స్ చేయించాలని భావించినా, అంత బోల్డ్ గా నటించేందుకు సిద్ధంగా లేకపోవడం వల్లనే అవకాశం ఛేజారిందని అర్థమవుతోంది.