అభిమానులు ఆందోళన పడొద్దు! శివన్న సందేశం
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోన్న సంగతి తెలిసిందే.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆయన అస్వస్తకు గురయ్యారు. ఆయన సతీమణి తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన హఠాత్తుగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. షూటింగ్ సెట్స్ లో దుమ్ము ఉపరితిత్తులకు పట్టడంతో అనారోగ్యానికి గురైనట్లు వైద్యలు తెలిపారు.
కొన్ని రోజుల పాటు డాక్టర్లు సూచించిన మందులు, అవసరమైన విశ్రాంతి తీసుకుని మళ్లీ షూటింగ్ కి హాజరవ్వడం మొదలు పెట్టారు. అయితే తాజాగా ఆయన బుధవారం చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో శివరాజ్ కుమార్ లైన్ లోకి వచ్చారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఈనెల 24న ఆయన కు ఆమెరికాలో ట్రీట్మెంట్ జరుగుతుందని సమాచారం. శివరాజ్ కుమార్ ప్రోఫెషనల్ గా ఇప్పుడు మరింత బిజీ అయ్యారు. అప్పట్లో కేవలం కన్నడ సినిమాలు మాత్రమే ఎక్కువగా చేసేవారు. ఇప్పుడు కన్నడ చిత్రాలతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రల అవకాశాలు రావడంతో నో చెప్పకుండా నటిస్తున్నారు. ఎక్కువగా తమిళ్ సినిమాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆయనపై పని ఒత్తిడి పెరిగినట్లు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `జైలర్`, ధనుష్ నటించిన `కెప్టెన్ మిల్లర్` వంటి చిత్రాల్లో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ 16వ చిత్రంలో, దళపతి విజయ్ 69వ చిత్రంలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇవి కాకుండా కన్నడలో హీరోగానూ కొన్ని సినిమాలు చేస్తున్నారు.