సానియాతో పెళ్లిపై షోయబ్‌కు షారూఖ్ ప్రశ్న
సెలబ్రిటీ జంట విడిపోయిన క్రమంలో షోయబ్ ఎఫైర్లకు సంబంధించిన మీడియా కథనాలు మరింత వేడి పెంచుతున్నాయి
సానియా మీర్జా తన భర్త నుంచి విడిపోయారనే వార్తలు అధికారికం. వివాహేతర సంబంధాల పుకార్ల నడుమ పాక్ నటి సనా జావేద్‌తో పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ షోయబ్ మాలిక్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. మాలిక్ తన మూడో పెళ్లిని అధికారికం చేసాడు. ఈ చర్యతో నెటిజనుల్లో అతడిపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. సనా జవేద్ ని అపహాస్యం చేస్తూ 'గట్టిగా పట్టుకో లేదంటే షోయబ్ పారిపోతాడు!' అంటూ ఘాటైన కామెంట్లు చేసారు నెటిజనులు. భారతదేశం సహా పాకిస్తాన్ నుంచి సానియా మిర్జా ఈ విషయంలో గొప్ప మద్ధతను అందుకుంది.
సెలబ్రిటీ జంట విడిపోయిన క్రమంలో షోయబ్ ఎఫైర్లకు సంబంధించిన మీడియా కథనాలు మరింత వేడి పెంచుతున్నాయి. పలువురు పాకిస్తానీ కథానాయికలతో మాలిక్ ప్రేమాయణాలను బయటపెడుతూ వెల్లువలా కథనాలు వెలువడుతున్నాయి. ఇంతలోనే కింగ్ ఖాన్ షారుఖ్ గతంలో ఓ షోలో షోయబ్ మాలిక్ పై సంధించిన ఓ ప్రశ్న తాలూకా వీడియో ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది.
అభిమానుల ఇన్‌స్టాగ్రామ్ లో దీనిని షేర్ చేయగా ఈ పోస్ట్ విపరీతంగా ఆకర్షించింది. షారూఖ్ ఖాన్, సానియా మీర్జా, షోయబ్ మాలిక్ టెలివిజన్ షోలో కనిపించారు. వారి నడుమ హిందీలో సంభాషణలు సాగాయి. ''ఉస్మే క్యా దిఖా ఐసా కి ఆప్నే జల్దీ సే షాదీ కర్లీ.. ఖూబ్‌సూరత్ హై, క్రికెట్ భీ థీక్ థాక్ ఖేల్ లేతా హై, సబ్‌కుచ్ బధియా హై, అయితే వ్యక్తిగత విషయం ఏమిటి? దీనికి భారత స్పోర్ట్స్ స్టార్ బదులిస్తూ ''మై తో బహుత్ కుచ్ దేఖా హై ఇన్మే... బహుత్ షై హై. యే ఆప్కో శిఖానా పడేగా ఇంకో థోడా బాత్ కర్నా'' SRK చమత్కరించారు, ''వో టు మెయిన్ కర్ లుంగా, అడ్జస్ట్ కర్ లుంగా మెయిన్ ఇస్కో, చింతించకండి!'' ఖాన్ షోయబ్ వైపు తిరిగి ''ఔర్ తుమ్హే సానియా కే బారే మే క్యా అచా లగా జో తుమ్హే మొహబ్బత్ హో గయీ, ప్యార్ హో గయా?'' అని అడిగాడు. పాకిస్తానీ ఆటగాడు షోయబ్ ''సోచ్నే కా టైమ్ నహీ మిలా, పెహ్లే షాదీ హో గయీ..'' అని బదులిచ్చాడు.
సమా టీవీ పాడ్‌కాస్ట్‌లో షోయబ్ మాలిక్ , నటి సనా జావేద్ మధ్య 3 సంవత్సరాల సంబంధం గురించి పాకిస్తాన్ జర్నలిస్ట్ నయీమ్ హనీఫ్ చమత్కారమైన ప్రశ్న అడిగిన వీడియో కూడా వైరల్ అయింది. ఈ జంట మొదట టెలివిజన్ రియాలిటీ షోలో కలుసుకున్నారు.. త్వరగా బలమైన సంబంధాన్ని ఏర్పరుచుకున్నారనేది అతడి ప్రశ్న. ముఖ్యంగా షోయబ్ టీవీ ప్రదర్శనలలో పాల్గొన్నప్పుడల్లా, సనాను కూడా ఆహ్వానించాలని పట్టుబట్టడమే దీనికి కారణం. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే ఆ ఇద్దరూ అప్పటికే సంతోషంగా వివాహం చేసుకున్నప్పటికీ, ఒకరికొకరు తమ మధ్య ఉద్ధేశాలు మారిపోయి, ఇతరుల ఆకర్షణతో ప్రేమ భావాలు మారిపోయాయనేది ఈ ఇంటర్వ్యూ సారాంశం. అదే క్రమంలో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, నటి సనా జావేద్ మూడేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారని కూడా ప్రచారం సాగింది.