రెండో పెళ్లి తర్వాత షోయబ్ పక్క చూపులు?
నటి సనా జావేద్‌ని రెండో పెళ్లి చేసుకున్న షోయబ్ గురించి ఈ బ్యూటీ వద్ద హోస్ట్ ప్రస్థావనకు తేవడంతో అది పాకిస్తానీ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ గా మారింది.
మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్ మరో కొత్త ఎఫైర్ విషయమై వార్తల్లో నిలిచాడు. పాకిస్థానీ చాట్ షో `లైఫ్ గ్రీన్ హై` తాజా ఇంటర్వ్యూలో నటి నవాల్ సయీద్ పాకిస్థానీ క్రికెటర్ల గురించి వ్యాఖ్యానిస్తూ ఒక షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది. నటి సనా జావేద్‌ని రెండో పెళ్లి చేసుకున్న షోయబ్ గురించి ఈ బ్యూటీ వద్ద హోస్ట్ ప్రస్థావనకు తేవడంతో అది పాకిస్తానీ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ గా మారింది.
ఐజాజ్ అస్లాం నదియా ఖాన్‌లతో జరిగిన ఇంటర్వ్యూలో చాలా మంది క్రికెటర్ల నుండి తనకు ప్రపోజల్స్ అందుతున్నాయని పాక్ నటి నవాల్ వెల్లడించింది. అయితే పెళ్లయిన క్రికెటర్ల నుండి కూడా తనకు ప్రపోజల్స్ (పిలుపు) వచ్చాయని బహిరంగంగా చెప్పి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆతిథ్యం ఇచ్చే వారిలో ఒకరు పాకిస్థాన్ క్రికెటర్ నసీమ్ షా నా? అని యాంకర్ అడిగారు. అయితే హోస్ట్ నవ్వేస్తూ షోయబ్ మాలిక్ పేరును సూచించారు. కాని నావల్ మరోసారి ప్రశ్నను తప్పించుకుని నవ్వడం ప్రారంభించింది.
పేర్లు స్కిప్ చేసినా కానీ నావల్ వారి ఉద్ధేశాన్ని బయటపెట్టేసింది. తనకు ప్రపోజ్ చేసేవారిలో పెళ్లయిన క్రికెటర్లు ఉన్నారని వ్యాఖ్యానించడం ద్వారా చాలా ప్రకంపనాలకు కారణమైంది. `నేను వారికి నాపై ఉన్న ప్రత్యేక అభిమానం గురించి మాట్లాడటం లేదు. క్రికెటర్లు అలా చేయకూడదని నేను భావిస్తున్నాను. నటుల కంటే ఎక్కువ మంది క్రికెటర్లు/క్రీడాకారులనే ఆరాధిస్తారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని (క్రీడాకారులను) చాలా క్రేజీగా భావిస్తే.. మీరు అలా చేయకూడదు! అని వ్యాఖ్యానించింది.
ఇంకా తననుంచి హోస్ట్ ఇంకా వివరాలను రాబట్టాలని ప్రయత్నించగా.. ``నేను దాని గురించి ఇకపై మాట్లాడదలచుకోలేదు`` అని నవాల్ చెప్పారు. దీంతో అన్ని వేళ్లు షోయబ్ వైపే చూపించాయి. అతడిని సందేహించేలా చేసాయి. ఇంటర్నెట్లోని ఒక విభాగం చాలా ఆశ్చర్యపోయేలా చేసిన ఎపిసోడ్ ఇది.
మరోవైపు షోయబ్ తన కొత్త భార్య సనా జావేద్ 31వ పుట్టినరోజును ఇటీవల గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాడు. షోయబ్ తో జతగా ఉన్నప్పటి ఫోటోలను సనా జావేద్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలు సానియా మీర్జా అభిమానులకు అంతగా నచ్చలేదు. వారు వ్యాఖ్యల విభాగంలో సనా జావేద్ ని ట్రోల్ చేశారు. ఒక అభిమాని ``మేము నిన్ను ద్వేషిస్తున్నాము`` అని రాశాడు. మరొకరు ``2024లో అత్యంత అసహ్యించుకునే జంట`` అని ఏవగించుకున్నారు.
2010లో హైదరాబాద్‌లో షోయబ్‌తో సానియా వివాహం జరిగింది. ఈ జంట వలీమా వేడుక పాకిస్థాన్‌లోని సియాల్కోట్లో జరిగింది. వారు 2018లో ఒక మగబిడ్డను స్వాగతించారు. అతడికి ఇజాన్ మీర్జా మాలిక్ అని పేరు పెట్టారు. ఈ ఏడాది జనవరిలో సానియా బృందం బ్రేకప్ ప్రకటన విడుదల చేసింది. ఇద్దరూ కొన్ని నెలలుగా విడిగా ఉన్నారని ధృవీకరిస్తూ, ఎలాంటి ఊహాగానాలు అవసరం లేదని.. వారి గోప్యతకు భంగం కలిగించవద్దని అభిమానులకు పిలుపునిచ్చారు.