'అఖండ 2'లో లేడీ అఘోరిగా ఆ హీరోయిన్..!
ప్రస్తుతం సూపర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ రూపొందుతోంది. అఖండ 2 లో బాలకృష్ణ మరోసారి పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు.
బాలకృష్ణ హీరోగా బ్యాక్ టు బ్యాక్ నాలుగు సక్సెస్‌లు దక్కించుకున్నారు. అఖండతో మొదలైన సక్సెస్ జోరు తాజాగా సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమా వరకు సాగింది. అఖండ తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్న బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. ప్రస్తుతం సూపర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ రూపొందుతోంది. అఖండ 2 లో బాలకృష్ణ మరోసారి పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈసారి అంతకు మించి సనాతన ధర్మం గురించి చూపిస్తూ హిందూ సాంప్రదాయాలపై సీన్స్ ఉండబోతున్నాయట.
ఇటీవల యూపీలో ప్రారంభం అయిన మహా కుంభమేళకి వెళ్లి మరీ దర్శకుడు బోయపాటి కొన్ని సీన్స్‌కి సంబంధించిన షూటింగ్ చేసుకుని వచ్చారట. బాలకృష్ణ అక్కడ షూటింగ్‌లో పాల్గొంటారనే ప్రచారం జరిగినా అది పుకార్లే అని తేలిపోయింది. అఖండ 2 లో మహా కుంభమేళకి సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నుల విందుగా ఉంటాయని, ప్రతి ఒక్కరికీ గూస్‌బంప్స్ వచ్చే విధంగా బోయపాటి ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇక సినిమాలో కీలకమైన ఒక సన్యాసిని/అఘోరి పాత్ర ఉంటుందట. ఆ పాత్ర కోసం బోయపాటి ఎంతో మంది సీనియర్ హీరోయిన్స్‌ను పరిశీలించి చివరకు ప్రముఖ నటి శోభనను ఎంపిక చేశారని తెలుస్తోంది.
ఇటీవల కల్కి సినిమాలో శోభన కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. అప్పట్లో హీరోయిన్‌గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శోభన ఈ మధ్య కాలంలో ఆచితూచి పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఉన్నారు. ఆమె పాత్రకు ప్రాముఖ్యత ఉంటే తప్ప సినిమాను కమిట్ కావడం లేదు. బాలకృష్ణ సినిమా కోసం బోయపాటి చెప్పిన పాత్ర ఆమెకు బాగా నచ్చిందట. అందుకే ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఈమధ్య కాలంలో లేడీ సన్యాసి పాత్రలు సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే శోభన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం అందుతోంది. త్వరలోనే అఖండ 2 గురించి మరింత క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో ఇప్పటి వరకు సింహా, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఆ మూడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో అఖండ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి బాలకృష్ణ కోసం, ఆయన ఫ్యాన్స్ కోసం పుల్ ప్యాక్ యాక్షన్ సన్నివేశాలతో పాటు సనాతన ధర్మంకి సంబంధించిన సన్నివేశాలను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాను ఇదే ఏడాదిలో దసరా కానుకగా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. అఖండ 2 తో ఈ ఏడాది మరో విజయాన్ని బాలయ్య సొంతం చేసుకుంటారా అనేది చూడాలి.