బంపరాఫర్ కొట్టేసిన అక్కినేని కోడలు
అందులో భాగంగానే శోభితకు ఓ బంపరాఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో శోభితకు ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.;

తెలుగమ్మాయే అయినప్పటికీ శోభితా ధూళిపాళ బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది. టాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసిన శోభితకు ఇప్పటివరకు స్టార్‌డమ్ మాత్రం దక్కలేదు. గతేడాది డిసెంబర్ లో నాగ చైతన్యను పెళ్లి చేసుకుని సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకున్న శోభిత ఇప్పుడు మళ్లీ తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని రెడీ అవుతోంది.
అందులో భాగంగానే శోభితకు ఓ బంపరాఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో శోభితకు ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. రంజిత్ సినిమాలో కథ, పాత్రలు, క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంజిత్ కథలే కాదు, ఆయన డైరెక్షన్ కూడా ఇతరుల సినిమాలకు చాలా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం రంజిత్ చేస్తున్న సినిమా వెట్టువన్.
దినేష్ హీరోగా, ఆర్య విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అశోక్ సెల్వన్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాంటి పెద్ద సినిమాలో ఇప్పుడు శోభిత హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. అయితే ఇంకా దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ బయటకు రాలేదు. పా .రంజిత్ సినిమాలో నటించే ఆర్టిస్టులకు ఎవరికైనా మంచి గుర్తింపు దక్కుతుంది.
దానికి కారణం ఆయన తన సినిమాలోని పాత్రకు సరిగ్గా సరిపోతారనుకుంటేనే వారిని అప్రోచ్ అవుతారు. లేదంటే అటు వైపు కూడా చూడరాయన. అలాంటి రంజిత్ డైరెక్షన్ లో నటించే ఛాన్స్ వచ్చిందంటే శోభితకు ఇది బంపారఫర్ అనే చెప్పాలి. అన్నీ అనుకున్నట్టు జరిగి ఈ కాంబినేషన్ సెట్ అయితే శోభిత తన టాలెంట్ మొత్తం బయటపెట్టి స్టార్‌డమ్ సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది.
ఈ సినిమాను గోల్డెన్ రెయోమ్స్ తో కలిసి నీలం ప్రొడక్షన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఎప్పుడో 2022లోనే రిలీజ్ చేయగా, ఇన్నేళ్లకు సినిమా షూటింగ్ ను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. నాగ చైతన్య, శోభిత పెళ్లి తర్వాత చైతూ తండేల్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు శోభిత కూడా చైతూలానే సక్సెస్ ను అందుకుంటుందేమో చూడాలి.