సంక్రాంతి హీరో అక్కడ వెరీ బిజీ!
ఈ షెడ్యూల్ లో భాగంగా వెంకటేష్-మీనాక్షి చౌదరిపై ఓ పాట కూడా తెరకెక్కిస్తున్నారు.
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో 'సక్రాంతికి వస్తున్నాం' అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. టైటిల్ కి తగ్గట్టే సంక్రాంతి పండుగ సందర్బంగా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. దీనిలో భాగంగా యూనిట్ డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేష్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో భాగంగా వెంకటేష్-మీనాక్షి చౌదరిపై ఓ పాట కూడా తెరకెక్కిస్తున్నారు.
అందమైన లొకేషన్లలో ఇద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్ ఇది అని సమాచారం. అనీల్ సినిమాలు అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ లైక్ చేసే చిత్రాలు. అందులోనూ వెంకటేష్ తోడైతే రచ్చ ఇంకే రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న పక్కా హిట్ బొమ్మగా ట్రేడ్ అంచనా వేస్తోంది. రిలీజ్ సమయం కూడా సమీపిస్తుండటంతో వీలైనంత వేగంగా షూటింగ్ పూర్తి చేయాలని కదులుతున్నారు.
ఇప్పటివరకూ పూర్తయిన భాగం వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మొత్తం షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంటే డిలే అవుతుంది. అందుకే యూనిట్ ఈ సినిమా విషయంలో ఎప్పటి పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడే పూర్తి చేస్తోంది. ఆ ధీమాతోనే యూనిట్ మరోవైపు ప్రచారం పనులు కూడా మొదలు పెట్టి ముందు కెళ్తోంది. ఇటీవలే ఓ ఈవెంట్ నిర్వహించి గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నలకు యూనిట్ సమాధానాలు ఇచ్చింది. ముక్కోణపు క్రైమ్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రంలో వెంకటేష్ మాజీ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అలాగే పోలీస్ పాత్రలో మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఇటీవల పోలీస్ గెటప్ లో ప్రచారంలో భాగంగా అదర గొట్టిన సంగతి తెలిసిందే. జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.