హాయ్ నాన్న హిట్టయినా.. తొందర పడట్లే..
నెక్స్ట్ సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చేవాళ్లు ఉన్నా.. వాటికి చాలా దూరంగా ఉంటున్నారట. తనకేం అడ్వాన్సులు వద్దు అంటున్నారట. అందుకు కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు శౌర్యువ్.
ఈ ఏడాది తొలి సినిమాతో హిట్ కొట్టేసిన డైరెక్టర్లలో శౌర్యువ్ ఒకరు. రీసెంట్గా నాని నటించిన హాయ్ నాన్న సినిమాకు దర్శకత్వం వహించిన ఆయన.. ఫస్ట్ మూవీతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై తండ్రీకూతుర్ల సెంటిమెంట్‌ను చక్కగా పండించి ఆయన మంచి మార్కులు కొట్టేశారు. దర్శకుడిగా తనదైన శైలిలో పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శౌర్యువ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా ఒక దర్శకుడు హిట్ కొట్టారంటే చాలు.. వెంటనే ఆయనకు అడ్వాన్సులు వస్తూనే ఉంటాయి. కొత్త దర్శకుడు, పాత దర్శకుడు అని సంబంధం ఉండదు. ఏ సినిమా ఎప్పుడు చేసినా పర్లేదు కానీ నిర్మాణ సంస్థలు మాత్రం అడ్వాన్స్ సొమ్మును ఇచ్చేస్తుంటారు. ఆ అడ్వాన్స్ తీసుకుని సినిమా ఖరారు చేస్తే చాలని భావిస్తుంటారు. హీరోలు కూడా ఆ డైరెక్టర్‌తో నటించేందుకే మొగ్గు చూపుతుంటారు.
కానీ హాయ్ నాన్నతో కమర్షియల్ హిట్ కొట్టిన డైరెక్టర్ శౌర్యువ్ మాత్రం అందుకు పూర్తిగా రివర్స్‌గా ఉంటున్నారట. ప్రస్తుతం తన తొలి సినిమా అయ్యాక ఖాళీగానే ఉంటున్నారట. నెక్స్ట్ సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చేవాళ్లు ఉన్నా.. వాటికి చాలా దూరంగా ఉంటున్నారట. తనకేం అడ్వాన్సులు వద్దు అంటున్నారట. అందుకు కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు శౌర్యువ్.
"నేను ఇంకా ఏ సినిమాకు ఓకే చేయలేదు. అసలు ఒక సినిమా అయిన వెంటనే మరో మూవీ ఒప్పుకోవాలెందుకు? స్టోరీ కుదరాలి కదా. మెయిన్‌గా ఆ కథ నాకు నచ్చాలి. నా మనసుకు నచ్చాలి. హాయ్ నాన్న మూవీ ఇంకా రిలీజై కొద్ది రోజులే అయింది. అస్సలు నాకేం తొందర లేదు. ఫ్యూచర్లో మంచి సినిమాలు తీద్దామనుకుంటున్నాను. అందుకు స్టోరీతోపాటు అన్నీ కలిసి రావాలి. అప్పుడే అడ్వాన్స్ తీసుకుని సినిమా చేస్తాను" అని చెప్పారు శౌర్యువ్.
బడ్జెట్ అనేది సినిమా కథపై ఆధారపడి ఉంటుందని శౌర్యువ్ తెలిపారు. కథను ఎలా అయినా చూపించొచ్చు కానీ ఎంత వరకు ఖర్చు పెట్టించాలో అంతే ఖర్చు పెట్టించాలని చెప్పారు. నెక్స్డ్ సినిమా మోస్తరు బడ్జెట్‌తో తీయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. తన వద్ద చాలా చిన్న కథలు ఉన్నాయని తెలిపారు. మరి ఫస్ట్ మూవీతోనే మెగా ఫోన్ పట్టిన శౌర్యువ్ కొత్త సినిమా ఎప్పుడు ప్రకటిస్తారో మరి.