హీరోయిన్ల విష‌యంలో ఆ విధానం మారాలి!

తాజాగా ఇదే అంశంపై శ్రద్దా క‌పూర్ కూడా త‌న బాణీని వినిపించింది. 'నేను 14 సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు ఎక్కువ సంపాదిస్తున్నాను. కానీ వేత‌న అస‌మాన‌త్వం ఉంది.

Update: 2024-10-20 08:30 GMT

బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో హీరోల‌తో స‌మానంగా హీరోయిన్ల‌కు ఎందుకు పారితోషికాలు ఇవ్వ‌డం లేదు? అన్న అంశంపై ఇప్ప‌టికే చాలా మంది భామ‌లు ఎవ‌రి అభిప్రాయ‌లు వారు పంచుకుంటున్నారు. అత్య‌ధిక పారితోషికం హీరోల‌కు ఇచ్చి? త‌మపై మాత్రం ప‌క్ష‌పాతి వైఖ‌రితో వ్య‌వ‌హిరిస్తున్నార‌ని చాలా మంది భామ‌లు ఆరోపించారు. ఇంకా చాలా విష‌యాల్లో హీరోయిన్ల విష‌యంలో వివ‌క్ష ఉంద‌నే అంశాన్ని ప‌లు సంద‌ర్భాల్తో తెర‌పైకి తెచ్చారు.

దీపికా ప‌దుకొణే, క‌రీనా క‌పూర్, కంగ‌నా ర‌నౌత్, ఐశ్వ‌ర్యారాయ్, క‌త్రినా కైఫ్ లాంటి భామ‌లంతా ఈ విషయంలో ఎంతో ఓపెన్ గా మాట్లాడారు. హీరోలకు ఇస్తోన్న ప్రాధాన్య‌త త‌మ‌కెందుకు ఇవ్వ‌డం లేద‌నే విష‌యాన్ని ప‌లు సంద‌ర్భాల్లో తెర‌పైకి తెచ్చారు. తాజాగా ఇదే అంశంపై శ్రద్దా క‌పూర్ కూడా త‌న బాణీని వినిపించింది. 'నేను 14 సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు ఎక్కువ సంపాదిస్తున్నాను. కానీ వేత‌న అస‌మాన‌త్వం ఉంది. ఈ విష‌యం ఎక్క‌డైనా చెప్ప‌గ‌ల‌ను. హీరోల‌తో స‌మాన పారితోషికాలు ప‌క్క‌న‌బెట్టండి.

వాళ్ల‌కు వ‌స్తోన్న పారితోషికం..మాకు ఇస్తోన్న పారితోషికం ఏమాత్రం పొంత‌న లేకుండా ఉంది. ఈ విధానం మారు తుంద‌ని ఆశిస్తున్నాను. సినిమా మేకింగ్‌లో ఏది పాజిటివ్‌గా పని చేస్తుందో? అది ఎలా తీయాలో? నిర్మాతలు ఆ కాల్స్ తీసుకోవాలి. అది వారి ప‌ని. పరిశ్రమ ఎటువైపు పయనిస్తుందో తెలిసిన వారు చాలా మంది ఉన్నారు. కొత్త‌గా వారి గురించి నేను మాట్లాడాల్సిన ప‌నిలేదు. ఇండ‌స్ట్రీలో ప‌రిస్థితులు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకునే వారు చాలా మంది ఉన్నారు. ప‌రిశ్ర‌మ‌ని చాలా ద‌గ్గ‌ర నిరంతరం వాళ్లు చూస్తూనే ఉంటారు. ఎవ‌రికి ఎంత ఇవ్వాలో వాళ్ల‌కు బాగా తెలుసు.

కానీ హీరోయిన్ల పారితోషికం విష‌యంలో అంద‌రూ సంతోషంగా ఉన్న‌ట్లు నేను భావించ‌డం లేక‌పోతున్నా. మా నాన్న సినిమాయేతర కుటుంబం నుండి వచ్చారు. ఢిల్లీ నుంచి ముంబైకి వ‌చ్చారు. మా తాతయ్యది టెక్స్‌టైల్ దుకాణం ఉంది. 'నువ్వు ఢిల్లీలో ఏం పనిచేస్తావు? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో' అని తాత‌య్య నాన్నతో చెప్పారు. దీంతోనాన్న రైలెక్కి బొంబాయి వ‌చ్చాడు. ఆ త‌ర్వాత మా నాన్న ట్రావెల్ ఏజెన్సీలో చేరారు. ఆయ‌న ప్ర‌యాణంలో ఎంతో ఎమోష‌న్ ఉంది. చాలా క‌ష్టాలు ఇబ్బందులు ప‌డ్డారు. అవి నాన్న చెబుతుంటే బాధ‌గా అనిపిస్తుంది' అని అన్నారు.

Tags:    

Similar News