పుష్పరాజ్‌తో సాహో బ్యూటీ కనెక్షన్?
తాజా సమాచారం మేరకు బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ దాదాపుగా ఈ పాట కోసం ఖరారైంది. నిర్మాతలు అడ్వాన్స్ కూడా చెల్లించారని వార్తలు వస్తున్నాయి.
శ్రద్ధా కపూర్ పరిచయం అవసరం లేదు. 'సాహో' చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ బ్యూటీ 'ఆషిఖి 2' చిత్రంలో అద్భుత నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అందానికి అందం ప్రతిభతో మెరిపిస్తున్న శ్రద్ధా ఇటీవల 800 కోట్లు వసూలు చేసిన సంచలన చిత్రం 'స్త్రీ 2'లో నటించింది. ఒక హారర్ థ్రిల్లర్ కాన్సెప్టుతో ఇంత పెద్ద సక్సెస్ సాధ్యమని నిరూపించడం గొప్ప విషయంగా మాట్లాడుకుంటున్నారు.
ఇప్పుడు శ్రద్ధా కపూర్ గురించిన గుబులు రేపే వార్త వైరల్ అవుతోంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ 2024 చిత్రం 'పుష్ప 2'లో స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధా కపూర్ ని ఎంపిక చేసుకున్నారనేది ఈ వార్త సారాంశం. సుకుమార్ సిగ్నేచర్ స్టైల్‌లో మైండ్ బ్లాక్ చేసే ఐటెం సాంగ్ లో శ్రద్ధా కనిపిస్తుందనేది టాక్. రంగస్థలంలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్, పుష్ప: ది రైజ్ లో 'ఊ అంటావా మావా..'ను కొట్టేలా ఈ పాటను డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.
'పుష్ప-2' విడుదలకు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో, ఈ చిత్రం ఐటమ్ సాంగ్ కోసం ఎదురుచూపులు హైఫీవర్ ని రాజేస్తున్నాయి. ఇంతలోనే ఈ వార్త వైరల్ అవుతోంది. తాజా సమాచారం మేరకు బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ దాదాపుగా ఈ పాట కోసం ఖరారైంది. నిర్మాతలు అడ్వాన్స్ కూడా చెల్లించారని వార్తలు వస్తున్నాయి. స్త్రీ-2తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని దూకుడుమీద ఉన్న శ్రద్ధా ఐటమ్ నంబర్ కోసం భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందని కూడా గుసగుస వినిపిస్తోంది. అయితే శ్రద్ధా కపూర్ ఎంపిక గురించి పుష్ప 2 టీమ్ ఇంతవరకూ ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెలువరించలేదు. పుష్ప 2 కి సంబంధించిన ప్రమోషన్స్ ని మరో లెవల్ కి చేర్చాలని టీమ్ భావిస్తోందట. ఐటమ్ నంబర్ గురించిన సమాచారం కూడా చెబుతారేమో వేచి చూడాలి.
పుష్పలో తన నటనకు బన్నీ జాతీయ అవార్డును గెలుచుకోవడంతో పార్ట్ 2 పై మరింత ఆసక్తి పెరిగింది. సీక్వెల్‌తో పుష్పరాజ్ ఈ స్టోరీని తదుపరి స్థాయికి తీసుకెళ్తాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అలాగే పుష్ప 2 ముగింపులో పుష్ప 3కి లీడ్ ఇస్తారని గుసగుస వినిపిస్తోంది. డిసెంబర్ 6న విడుదల కానున్న ఈ చిత్రం 100కోట్ల ఓపెనింగులు సాధిస్తుందని ఒక అంచనా.