శ్రద్దా పుష్ప 2, ప్యారడైజ్‌ వదిలేసింది... కారణం ఒక్కటే!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ టాలీవుడ్‌లో ప్రభాస్‌తో కలిసి 'సాహో' సినిమాలో నటించిన విషయం తెల్సిందే.

Update: 2024-12-02 19:30 GMT

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ టాలీవుడ్‌లో ప్రభాస్‌తో కలిసి 'సాహో' సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా సౌత్‌లో పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేక పోయినా నార్త్‌లో భారీ వసూళ్లు రాబట్టింది. సాహో సినిమా కోసం శ్రద్దా కపూర్‌ రూ.3 కోట్ల పారితోషికం అందుకుంది. ఆ సినిమా తర్వాత తెలుగు సినిమాల్లో నటించేందుకు ఈమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. కొన్ని సినిమాలను స్క్రిప్ట్ కారణంగా తిరస్కరిస్తూ వచ్చింది, కొన్ని సినిమాలను పారితోషికం కారణంగా వదులుకుంది. భారీ పారితోషికం డిమాండ్‌ చేయడం ద్వారా ఇటీవల పుష్ప 2 లో ఐటెం సాంగ్‌ చేసే అవకాశం కోల్పోయిన విషయం తెల్సిందే.

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ మూవీ పుష్ప 2 లో ఐటెం సాంగ్‌ చేసేందుకు శ్రద్దా కపూర్‌ను సంప్రదించడం జరిగింది. సినిమాలోని ఐటెం సాంగ్‌ను చేసేందుకు ఒప్పుకుంది కానీ భారీ పారితోషికం డిమాండ్‌ చేసింది. ఏకంగా రూ.8 కోట్లను ఆమె డిమాండ్‌ చేసిందట. సినిమాకు ఉన్న బజ్‌, సినిమా యొక్క బడ్జెట్‌ నేపథ్యంలో ఏకంగా రూ.8 కోట్లను ఆమె డిమాండ్‌ చేయడం జరిగిందట. కానీ ఆమె డిమాండ్‌కి నిర్మాతలు బిత్తర పోయారు. చివరకు రూ.5 కోట్ల వరకు ఆమెకు ఇచ్చేందుకు అంగీకరించారట. కానీ ఆమె మాత్రం రూ.8 కోట్లకు తగ్గేది లేదు అంటూ పుష్ప డైలాగ్‌ చెప్పిందట. దాంతో నిర్మాతలు తగ్గి శ్రీలీలతో కిస్సిక్‌ సాంగ్‌ను చేసిన విషయం తెల్సిందే.

శ్రీలీలకు కిస్సిక్‌ పాట కోసం రూ.2 కోట్లకు అటు ఇటుగా ఇచ్చి చేయించారు. అల్లు అర్జున్‌ తో శ్రీలీల వేసిన మాస్‌ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. శ్రద్ద కపూర్‌ను తీసుకున్నా ఇంత బెస్ట్‌గా కిస్సిక్‌ సాంగ్‌ వచ్చి ఉండేదా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. శ్రద్దా కపూర్‌ పుష్ప 2 ఆఫర్‌నే కాకుండా నానితో ప్యారడైజ్ సినిమాలో నటించే అవకాశాన్ని సైతం పారితోషికం భారీగా డిమాండ్‌ చేయడం వల్ల కోల్పోయింది అంటూ వార్తలు వస్తున్నాయి. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ప్యారడైజ్ సినిమా కోసం ఆమె ఏకంగా రూ.12 కోటలను డిమాండ్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

శ్రద్దా కపూర్‌ భారీ పారితోషికం డిమాండ్‌ చేయడంతో ఆమెను తీసుకోవాలన్న ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. శ్రద్దా కపూర్ కాకుండా మృణాల్‌ ఠాకూర్‌ను ఈ సినిమా కోసం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నానితో ఇప్పటికే మృణాల్‌ హాయ్‌ నాన్న సినిమాను చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాకు మంచి గుర్తింపు రావడంకు మృణాల్‌ క్రేజ్ యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని శ్రీకాంత్‌ ఓదెల ప్లాన్‌ చేస్తున్నారు. మృణాల్‌ కి రూ.5 కోట్ల లోపు పారితోషికం ఇచ్చినా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట. నానికి జోడీగా ప్యారడైజ్‌లో నటించబోతున్న ముద్దుగుమ్మ ఎవరు అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News