'పుష్ప 2' కి నో... 'వార్ 2' కి ఓకే!
శ్రీలీల కంటే ముందు బాలీవుడ్ ముద్దుగుమ్మతో ఈ ఐటెం సాంగ్ చేయించాలని నిర్మాతలు భావించారు.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమాలో కిస్సిక్ ఐటెం సాంగ్‌ను శ్రీలీల చేసిన విషయం తెల్సిందే. శ్రీలీల కంటే ముందు బాలీవుడ్ ముద్దుగుమ్మతో ఈ ఐటెం సాంగ్ చేయించాలని నిర్మాతలు భావించారు. దర్శకుడు సైతం అదే అనుకున్నాడు. సాహో సినిమాలో నటించి తెలుగులోనూ మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ శ్రద్ద కపూర్‌తో పుష్ప 2 లో ఐటెం సాంగ్ చేయించాలని భావించారు. ఆమెతో చర్చలు జరిపారు. కాని కొన్ని కారణాల వల్ల ఆమె నో చెప్పింది. దాంతో ఆ స్థానంలో శ్రీలీలను తీసుకు వచ్చారు. పుష్ప 2 లో శ్రీలీల కంటే శ్రద్ద కపూర్ నటించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయంను ఇప్పటికీ చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు.
పుష్ప 2 సినిమాను మిస్ చేసుకున్న శ్రద్ద కపూర్ తాజాగా 'వార్ 2' సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది. హృతిక్ రోషన్ హీరోగా ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే సినిమా చివరి దశ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. అందులో భాగంగా ఐటెం సాంగ్ చిత్రీకరణ చేయబోతున్నారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా కథకి మ్యాచ్ అయ్యే విధంగా సందర్భానుసారంగా ఒక ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఆ ఐటెం సాంగ్‌లో శ్రద్దా కపూర్‌ను నటింపజేసేందుకు గాను దర్శకుడు అయాన్ ముఖర్జీ సంప్రదింపులు జరుపుతున్నాడని తెలుస్తోంది.
దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా 'వార్ 2'. ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతున్న వార్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. దేవర సినిమా భారీ వసూళ్లు సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపైనా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పైగా ఈ సినిమాను పక్కా కమర్షియల్ సినిమాగా మూడు నాలుగు పాటలు, అందులో ఒక ఐటెం సాంగ్‌తో పాటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో ఫైట్ ఇంకా సాంగ్ సైతం ఉంటుందని తెలుస్తుంది. అందుకే వార్ 2 పై బాలీవుడ్ వర్గాల వారితో పాటు టాలీవుడ్‌లోనూ అంచనాలు ఉన్నాయి. వార్ సినిమా సూపర్ హిట్ కావడంతో వార్ 2పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
గత ఏడాది స్త్రీ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. స్త్రీ 2 సినిమా దాదాపు రూ.850 కోట్లు రాబట్టిందని సమాచారం అందుతోంది. అందుకే వార్ 2 లో శ్రద్దా కపూర్ ఐటెం సాంగ్ చేస్తే కచ్చితంగా సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే సినిమాలో ఆమెను ఐటెం సాంగ్‌లో నటింపజేసేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో నటించబోతున్నాడు. ఈ నెలలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతుంది. ఎన్టీఆర్ త్వరలోనే సినిమా షూట్‌లో జాయిన్ కాబోతున్నాడు.