19 ఏళ్ల‌కే వెన్ను జారింది.. 30 కేజీలు త‌గ్గిన న‌టి

అధిక బ‌రువు ఈరోజుల్లో పెద్ద స‌మ‌స్య‌. చాలామంది యువ‌తీ యువ‌కులు ఊబకాయం భారిన ప‌డుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

Update: 2025-01-18 17:30 GMT

అధిక బ‌రువు ఈరోజుల్లో పెద్ద స‌మ‌స్య‌. చాలామంది యువ‌తీ యువ‌కులు ఊబకాయం భారిన ప‌డుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. సెల‌బ్రిటీల్లోను ఈ స‌మ‌స్య తీవ్రంగానే ఉంది. సారా అలీఖాన్, భూమి ఫెడ్నేక‌ర్, సోనాక్షి సిన్హా, సోన‌మ్ కపూర్ స‌హా ప‌లువురు క‌థానాయిక‌లు అధిక‌బ‌రువును త‌గ్గించుకుని క‌థానాయిక‌లుగా రాణించారు.


ప్ర‌ముఖ న‌టి శ్రీ‌య చౌద‌రి వారంద‌రి బాట‌లోనే ఊబ‌కాయం త‌గ్గించుకునేందుకు పడిన ఇబ్బందుల‌ గురించి మాట్లాడారు. 19 ఏళ్ల వయసులో స్లిప్ డిస్క్ తో బాధపడిన ఈ భామ‌ 30 కిలోల బరువు తగ్గడం కోసం చాలా శ్ర‌మించాన‌ని తెలిపింది. త‌న ఫేవ‌రెట్ హృతిక్ రోషన్ తనను ఫిట్‌గా మార్చడానికి ఎలా ప్రేరేపించాడో కూడా తెలిపింది. `బాండిష్ బాండిట్స్` వెబ్ సిరీస్ తో పాపుల‌రైన‌ శ్రేయ చౌదరి ఫిట్‌నెస్ ప్ర‌యాణం ఎంద‌రికో స్ఫూర్తిదాయ‌కం.


19 ఏళ్ల చిన్న వయసులో బాగా బరువు పెర‌గ‌డంతో స్లిప్డ్ డిస్క్ స‌మ‌స్య త‌లెత్తింద‌ని .. చివరకు తనను తాను తేలికగా తీసుకోకూడదని నిర్ణయించుకుని 30 కిలోల బరువు తగ్గాన‌ని శ్రేయా తెలిపింది. నేను శారీరక శ్రమ చేయడం మానేయ‌డం వ‌ల్ల‌నే ఈ స‌మ‌స్య త‌లెత్తింద‌ని కూడా వెల్ల‌డించింది. `నాకు నేనే చెప్పుకున్నాను..ఎప్పటికీ ఫిట్ నెస్ వదులుకోను!`` అనే క్యాప్షన్‌తో సుదీర్ఘ నోట్ ని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆ లేఖలో ఫిట్ నెస్ ఆవ‌శ్య‌క‌త గురించి శ్రేయా ప్ర‌స్థావించింది.


అధిక బ‌రువు పెర‌గ‌డం వ‌ల్ల వెన్నులో డిస్క్ జ‌రిగి ప‌రిణామం తీవ్ర‌మైంది. ఆరోగ్య ప‌రిస్థితి దిగ‌జారింది. చిన్న వ‌య‌సులోనే పెద్ద స‌మ‌స్య‌ను ఎదుర్కొన్నాను. నా క‌ల‌ల‌పై ఫోక‌స్ చేయ‌లేక‌పోయాను.. కుంగిపోయాను.. అని శ్రీ‌య తెలిపింది. అయితే 21 సంవత్సరాల వయస్సులో చాలా శ్ర‌మించి 30 కిలోల మేర బ‌రువు త‌గ్గాను. త‌ర్వాత‌ స్లిప్డ్ డిస్క్ తిరిగి రాలేదు అని తెలిపింది. ``జీవితం స‌వాళ్లు విసురుతుంది.. కానీ మ‌నం ముందుకు సాగేందుకే ప్ర‌య‌త్నించాల‌``ని కూడా శ్రీ‌య అన్నారు. ఒకప్పుడు వెన్ను నొప్పితో బాధ ప‌డ్డ నేను ఇప్పుడు మృగంలా బాక్సింగ్ చేయగలను! నృత్యం చేయగలను.. షూటింగ్‌ల సమయంలో గంటల తరబడి నా రెండు కాళ్లపై నిలబడగలను. అవసరమైనప్పుడల్లా సెట్స్‌లో నా శరీరాన్ని తీవ్రంగా క‌ష్ట‌పెట్ట‌గ‌ల‌ను.. అని తెలిపింది. మనకు ఈ జీవితం బహుమానం.. మనం దానిని పూర్తిగా జీవించడానికి ప్రయత్నించాలి! అని కూడా అంది.

Tags:    

Similar News