గేమ్ ఛేంజర్.. క్రిస్ గేల్ లా శ్రేయా ఘోషల్!
ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. "మా ప్రియమైన నైటింగేల్ శ్రేయ ఘోషల్.. క్రిస్ గేల్ లా 90 నిమిషాల్లో 3 వెర్షన్లలో సాంగ్ రికార్డింగ్ ను పూర్తి చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. చరణ్ కు జోడీగా కియారా అడ్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎస్ జే సూర్య, అంజలి, శ్రీకాంత్, జయరాం, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ రెండు సాంగ్స్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. జరగండి జరగండి సాంగ్ తోపాటు రా మచ్చా మచ్చా పాటను విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడో సింగిల్ ను త్వరలో మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. మొదటి రెండు సాంగ్స్ మాస్ పాటలు కాగా.. ఈసారి మెలోడీ పాటను విడుదల చేయనున్నట్లు తమన్ కొద్ది రోజుల క్రితం తెలిపారు. ప్రేక్షకులను ఆ పాట కచ్చితంగా కట్టిపడేస్తుందని చెప్పారు.
అక్టోబర్ లో మెలోడీని విడుదల చేస్తామని పోస్ట్ చేశారు. ఇప్పుడు దీపావళికి సాంగ్ రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో తమన్.. నేడు క్రేజీ అప్డేట్ ఇచ్చారు. థర్డ్ సింగిల్ ను స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ పాడినట్లు వివరించారు. తెలుగు, హిందీ, తమిళ.. మూడు వెర్షన్లను ఆమెనే పాడినట్లు చెప్పారు. మూడు భాషలు కలిపి.. కేవలం 90 నిమిషాల్లో రికార్డింగ్ ను పూర్తి చేశారని తెలిపారు. శ్రేయ ఘోషల్ స్పీడ్ ను క్రికెటర్ క్రిస్ గేల్ తో పోల్చారు తమన్.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. "మా ప్రియమైన నైటింగేల్ శ్రేయ ఘోషల్.. క్రిస్ గేల్ లా 90 నిమిషాల్లో 3 వెర్షన్లలో సాంగ్ రికార్డింగ్ ను పూర్తి చేశారు. ఆమె పాడిన ఆ సూపర్ కూల్ సాంగ్.. ఎల్లప్పుడూ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది" అని తెలిపారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సాంగ్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. శ్రేయో ఘోషల్ పాడారంటే.. ఇక సాంగ్ తిరుగలేదని ఫిక్స్ అయిపోవాలని అంటున్నారు.
అయితే ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రాన్ని క్రిస్మస్ కు రిలీజ్ చేస్తామని పలుమార్లు దిల్ రాజు చెప్పడంతో డిసెంబర్ 20న విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా సోషల్ మీడియాలో ఇన్ డైరెక్ట్ గా అదే తెలిపారు. ఆ తర్వాత డిసెంబర్ 25వ తేదీ అని టాక్ వచ్చింది. చివరకు సంక్రాంతికి తీసుకువస్తున్నారు. జనవరి 10వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. మరి గేమ్ ఛేంజర్.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.