మమ్మీ అయినా డోంట్ కేర్.. రివీలింగ్ బ్లౌజ్లో చెలరేగిన శ్రీయ!
గత కొంతకాలంగా శ్రీయ కోశ్చీవ్ ఫోటోషూట్లు అంతర్జాలంలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.
గత కొంతకాలంగా శ్రీయ కోశ్చీవ్ ఫోటోషూట్లు అంతర్జాలంలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాతా ఈ భామ హద్దులు చెరిపేసి చెలరేగిపోతోంది. భర్త కోశ్చీవ్ తో పబ్లిక్ లోనే హగ్గులు, కిస్సులతో రెచ్చిపోతున్న శ్రీయ, ఫోటోషూట్ల విషయంలో దుమ్ము దులిపేస్తోంది.
ఇలా అయితే లాభం లేదు. నేటితరంతో పోటీపడాలంటే తాడో పేడో తేల్చాల్సిందే అన్నట్టుగా ఉంది శ్రీయ వ్యవహారం. తాజాగా శ్రీయ మరోసారి తనదైన శైలిలో ఫోటోషూట్ లో రివీలింగ్ డ్రెస్ లో చెలరేగిపోవడం హాట్ టాపిక్ గా మారింది. శ్రీయ బ్లౌజ్ ఊహించిన దానికంటే స్పైసీగా డిజైన్ చేయడం ఇక్కడ గమనించదగినది. ఇది రొటీన్ కి భిన్నంగా తన ఇన్నర్ అందాలను ఒక రేంజులో ఎలివేట్ చేస్తోంది. సీనియర్ బ్యూటీ తగ్గేదేలే అన్నట్టుగా చెలరేగిపోయింది.
శ్రియా శరణ్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత పాపులర్ నటీమణులలో ఒకరిగా వెలుగుతోంది. పెళ్లి తర్వాతా ఈ భామ షైన్ అవుతున్న తీరు నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. శ్రీయ కంటే చాలా ఆలస్యంగా వచ్చి కనుమరుగైన చాలా మంది భామలతో పోలిస్తే ఇప్పటికీ అదే గ్లామర్ తో దుమ్ము రేపుతోంది. ఫ్యాషన్ ఐకాన్‌గా శ్రియా శరణ్ తనను తాను ఆవిష్కరించుకుంటున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవలే SIIMA బిజినెస్ అవార్డ్ నైట్ ఈవెంట్‌కు హాజరైనప్పుడు గుబులు రేపే లుక్ తో కనిపించింది. ఇంతలోనే ఇప్పుడు టూమచ్ రివీలింగ్ డ్రెస్ లో దుమారం రేపింది. దీనికి ఒక నెటిజన్ స్పందిస్తూ `మిరుమిట్లుగొలిపే అందం` అని ప్రశంసించారు.
శ్రియా శరణ్ చివరిగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అయిన హిందీ సిరీస్ `షోటైమ్`లో కనిపించింది. మిహిర్ దేశాయ్ - అర్చిత్ కుమార్ దీనికి దర్శకత్వం వహించారు. తారాగణంలో నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హష్మీ, మహిమా మక్వానా, మౌని రాయ్, రాజీవ్ ఖండేల్వాల్, శ్రియా శరణ్, విశాల్ వశిష్ఠ వంటి పేర్లు ఉన్నాయి. ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా , మిహిర్ దేశాయ్ ఈ షోను నిర్మించగా, ఆనంద్ భాస్కర్ సంగీతం అందించారు. తదుపరి తన ప్రాజెక్టుల గురించి ప్రకటించాల్సి ఉంది.