శ్రియ తో ఆ గౌను ల‌వ్ లో..అందుకే ఆ రేంజ్ లో!

తాజాగా అమ్మ‌డు ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా రూపొందించినగ ఔనులో త‌ళుకులీనిన వైనం నెటి జ‌నుల్ని ఆక‌ర్షిస్తుంది.

Update: 2024-08-18 04:22 GMT

శ్రియ శరన్ వైరల్ సెన్షేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకుండా నెటిజ నుల్లో.. అభిమానుల్లోనూ నిరంతరం హాట్ టాపిక్ గా మారడం బ్యూటీ ప్రత్యేకత. ట్రెండీ ఫోటోలను షేర్ చేస్తూ క్రేజీ భామగా యువత గుండెల్లో నిలుస్తుంది. అగ్ర హీరోయిన్ గా రాణిస్తోన్న సమయంలో ఎలాంటి హవా సాగించిందో? ఇప్పటికీ బోయ్స్ లో అదే ఫాలోయింగ్ ని మెయింటెన్ చేస్తుంది. ఏ ఇతర నాయికకు సాధ్యం కానిది శ్రీయకు మాత్రమే సాధ్యమైనది.

 

తాజాగా అమ్మ‌డు ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా రూపొందించినగ ఔనులో త‌ళుకులీనిన వైనం నెటి జ‌నుల్ని ఆక‌ర్షిస్తుంది. న‌లుపు వ‌ర్ణం గౌనుపై చుక్కుల డిజైన్ శ్రియ‌ని మ‌రింత అందంగాప్రొజెక్ట్ చేసింది. అమ్మ‌డికి ఈ ఔట్ ఫిట్ ప‌ర్పెక్ట్ గా సూట‌యింది. ఓవైపు క్లీవేజ్ బ్యూటీని హైలైట్ చేస్తూనే గౌను ప్ర‌త్యేక‌త‌ను హైలైట్ చేస్తుంది. తాను సైతం మెచ్చిన గౌను అంటూ ఓ క్యాప్ష‌న్ ఇచ్చింది.

 

మీరు కూడా లైక్ చేయండి అంటూ అమ్మ‌డు ఆ బ్రాండ్ ని ప్ర‌మోట్ చేస్తుంది. ఇక నెటి జ‌నుల అభిమానా నికైతే కొద‌వ‌లేదు. శ్రియ అనే అందం ఆ మాట చెబితే కుర్రాళ్లు ఊరుకుంటారా? ఆ గౌన్ మీతో ప్రేమ‌లో ప‌డింది..కాబ‌ట్టే మీరు గౌనును అంత‌గా ఇష్ట‌ప‌డుతున్నారు. బ‌హుశా మీరు ఇంత‌వ‌ర‌కూ ఏగౌను గురించి ఇలాంటి క్యాప్ష‌న్ ఇచ్చింది లేదని ఓ యూజ‌ర్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

 

ఇక కెరీర్ ప‌రంగా శ్రియ వేగం బాగా త‌గ్గిన‌ట్లే క‌నిపిస్తోంది. మునుప‌టిలా వేగం ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతుంది. 2022 లో మూడు సినిమాలతో అల‌రించిన అమ్మ‌డు గ‌తే ఏడాది కేవ‌లం 'క‌బ్జా'..'మ్యూజిక్ స్కూల్' లాంటి చిత్రాల్లోనే న‌టించింది. ఆ రెండు కూడా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. ఈ ఏడాది మాత్రం 'షోటైమ్' అనే సిరీస్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

Tags:    

Similar News