డెకాయిట్.. శ్రుతి ప్లేస్ లో ఎవరంటే?

డెకాయిట్ టైటిల్ టీజర్.. సినీ ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. జూలియెట్ ఎన్నేళ్లయింది మనం కలిసి అనే డైలాగ్‍ తో అడివి శేష్ ఎంట్రీ ఇచ్చారు

Update: 2024-10-17 11:01 GMT

యువ కథానాయకుడు అడివి శేష్ నటిస్తున్న మూవీల్లో ఒకటి డెకాయిట్. ఆయన హీరోగా ఇప్పటికే వచ్చిన క్షణం, గూఢచారి వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన షానీల్ డియో.. డెకాయిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తెలుగు, హిందీలో ద్విభాషా చిత్రంగా సుప్రియ యార్లగడ్డ రూపొందిస్తున్నారు. గత ఏడాది చివర్లో మూవీ టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

డెకాయిట్ టైటిల్ టీజర్.. సినీ ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. జూలియెట్ ఎన్నేళ్లయింది మనం కలిసి అనే డైలాగ్‍ తో అడివి శేష్ ఎంట్రీ ఇచ్చారు. అల్లర్లు జరిగిన ప్రాంతంలో గన్ పట్టుకొని శ్రుతి కనిపించారు. ఆ తర్వాత శేష్, శ్రుతి ఇద్దరూ ఒకరికొకరు తుపాకులు ఎక్కు పెట్టుకుంటారు. తుపాకీ ఫైర్ చేసినట్టు, కింద పడినట్టు బ్యాక్ గ్రౌండ్ సౌండ్ వచ్చింది. ఇద్దరు మాజీ లవర్స్ తప్పని పరిస్థితుల్లో కలిసి దోపిడీలు చేయడమే డెకాయిట్ మూవీ ప్రధాన బ్యాక్‍ డ్రాప్ గా క్లారిటీ వచ్చింది.

మొత్తంగా ఇంటెన్స్, లవ్ యాక్షన్ చిత్రంగా డెకాయిట్ తెరకెక్కిస్తున్నట్లు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే రీసెంట్ గా సినిమా నుంచి హీరోయిన్ శ్రుతి హాసన్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. డేట్స్ ఇష్యూ కారణంగా ఆమె.. ఆ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే శ్రుతి.. మేకర్స్ కు కొన్ని రోజుల డేట్స్ ఇచ్చారట. కానీ డైరెక్టర్ షానీల్ డియో.. మెడికల్ ఎమర్జెన్సీ వల్ల అమెరికా వెళ్లారట.

దీంతో డేట్స్ అడ్జెస్ట్ చేసుకోలేక శ్రుతి హాసన్.. డెకాయిట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ ను డెకాయిట్ మేకర్స్ సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పారట. త్వరలోనే సెట్స్ లో అడుగుపెడతానని తెలిపినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో మేకర్స్.. కొత్త హీరోయిన్ పేరు అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని వినికిడి. స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే ఇప్పటికే శ్రుతి హాసన్, అడవి శేష్ పై షూట్ చేసిన సీన్స్ అన్నీ మేకర్స్ డిలీట్ చేశారని తెలుస్తోంది. కొత్త హీరోయిన్ వచ్చాక మళ్లీ ఫ్రెష్ గా షూట్ చేయనున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ కూడా మేకర్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది స్టార్టింగ్ లో ప్రేక్షకుల ముందుకు మూవీని తీసుకురానున్నట్లు సమాచారం. మరి డెకాయిట్ లో కొత్త హీరోయిన్ గా ఎవరు సెలెక్ట్ అయ్యారో వేచి చూడాలి.

Tags:    

Similar News