సొంత గుర్తింపు కోసం శ్రుతిహాస‌న్ నిజాయితీ

వ‌రుస‌గా రెండుసార్లు ప్రేమ‌లో వైఫ‌ల్యం, న‌టిగా ఆరంభం ఫ్లాపులు ఎదురైన‌ త‌ర్వాత కూడా శ్రుతిహ‌స‌న్ అగ్ర క‌థానాయిక‌గా ప‌రిశ్ర‌మ‌లో ఎదిగింది.

Update: 2025-02-26 12:30 GMT

వ‌రుస‌గా రెండుసార్లు ప్రేమ‌లో వైఫ‌ల్యం, న‌టిగా ఆరంభం ఫ్లాపులు ఎదురైన‌ త‌ర్వాత కూడా శ్రుతిహ‌స‌న్ అగ్ర క‌థానాయిక‌గా ప‌రిశ్ర‌మ‌లో ఎదిగింది. స్టార్ హీరోల స‌ర‌స‌న వ‌రుసగా అవ‌కాశాలు అందుకుంది. ఇటీవ‌ల ఈ భామ మూడు బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో అవ‌కాశాలు ద‌క్కించుకుంది. కంబ్యాక్ లో ఈ మూడూ త‌న‌కు సంతృప్తిక‌ర‌మైన ఫ‌లితాన్ని అందించాయి. ఆ మూడు సినిమాలు వీరసింహారెడ్డి, వాల్టెయిర్ వీరయ్య, స‌లార్: పార్ట్ వ‌న్ - సీజ్ ఫైర్.

`స‌లార్ 2` త‌ర్వాత ర‌జ‌నీ-లోకేష్ క‌న‌గ‌రాజ్ కాంబినేష‌న్‌లోని కూలి చిత్రంలో న‌టిస్తోంది. అలాగే విజ‌య్ సేతుప‌తితో క‌లిసి `ట్రైన్` అనే ప్ర‌యోగాత్మ‌క చిత్రానికి సంత‌కం చేసింది. ద‌ళ‌ప‌తి విజయ్ తదుపరి చిత్రం `జననాయకన్‌`లో శ్రుతి ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తుందని కూడా ఊహాగానాలు చెల‌రేగాయి.

దిగ్గ‌జ న‌టుడు కమల్ హాసన్ కుమార్తె అయినా కానీ, తండ్రి పేరును ఉప‌యోగించుకునేందుకు శ్రుతి పూర్తిగా వ్య‌తిరేకం. త‌న తండ్రిని గుర్తించినంత‌గా త‌న‌ను గుర్తించ‌ర‌నే భ‌యం త‌నకు ఉంది. అందుకే తాను చ‌దువుకునేప్పుడు.. కెరీర్ ప్రారంభించిన రోజుల్లో తండ్రి పేరును ఎక్క‌డా ఉప‌యోగించ‌లేద‌ని తెలిపింది. అలాగే స్నేహితుల‌కు త‌న ఐడెంటిటీని కూడా చెప్పేదానిని కాద‌ని వెల్ల‌డించింది.

క‌మ‌ల్, సారిక‌ల గురించి ప్ర‌జ‌ల‌కు తెలిస్తే వారి గురించి మాట్లాడుతారు కానీ, త‌న గురించి ఎవ‌రైనా మాట్లాడుతారా? అని కూడా శ్రుతి ఆందోళ‌న చెందింది. త‌న‌ స్నేహితులకు ఫేక్ ఐడెంటిటీని ప‌రిచ‌యం చేయ‌డం ద్వారా కూడా త‌ప్పించుకుంది. అయితే క‌థానాయిక అయ్యాక మాత్రం అజ్ఞాతవాసాన్ని దాచలేకపోయింది. అయినా న‌టిగా త‌న‌దైన ముద్ర వేసి ముందుకు సాగేందుకు చాలా హార్డ్ వ‌ర్క్ ను ఆశ్ర‌యించింది. ఇప్పుడు అగ్ర క‌థానాయిక హోదా వెన‌క త‌న కృషి పట్టుద‌ల అసాధార‌ణ‌మైన‌ది.

Tags:    

Similar News