డేట్‌ బిల్లు సగం మాత్రమే పే చేస్తా..!

కెరీర్‌ ఆరంభంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా పవన్‌ కళ్యాణ్ తో నటించిన గబ్బర్‌ సింగ్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో కమర్షియల్‌గా నిలదొక్కుకుంది

Update: 2024-10-19 12:30 GMT

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ నట వారసురాలు శృతి హాసన్‌. కెరీర్‌ ఆరంభంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా పవన్‌ కళ్యాణ్ తో నటించిన గబ్బర్‌ సింగ్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో కమర్షియల్‌గా నిలదొక్కుకుంది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. సక్సెస్ ఫ్లాప్‌ అని చూడకుండా, సినిమాలో తన పాత్ర పరిధి అనేది చూసుకోకుండా వచ్చిన ప్రతి ఒక్క ఛాన్స్ ను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేసే ఈ అమ్మడు ప్రస్తుతం తన తండ్రి వయసు ఉండే రజనీకాంత్‌ మూవీ కూలీలో నటిస్తున్న విషయం తెల్సిందే. కూలీలో శృతి హాసన్ పాత్ర ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కూలీ సినిమాతో పాటు తెలుగులో అడవి శేష్‌ తో కలిసి డెకాయిట్‌ అనే విభిన్నమైన ప్రేమ కథ చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ వీడియో సినిమాపై అంచనాలను ఆకాశానికి పెంచేలా చేసింది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి నటన ప్రతిభ, మంచి ఫిజిక్ ఉండటం వల్ల శృతి హాసన్ కి రెగ్యులర్‌గా సినిమాల్లో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మరో వైపు ఈమె తన ప్రేమ కథల వల్ల రెగ్యులర్‌గా వార్తల్లో ఉంటూనే ఉంది. ఇప్పటికే ఇద్దరితో ప్రేమలో పడ్డ ఈమె రెగ్యులర్‌గా స్నేహితులతో డేట్‌ కి వెళ్లడం జరుగుతుందట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో డేట్‌ గురించి శృతి హాసన్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

శృతి హాసన్‌ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... స్నేహితులతో డేట్‌ కి వెళ్లిన సమయంలో బిల్‌ నేను పే చేస్తాను. వారిపై ఉండే ప్రేమ, అభిమానంను నేను బిల్లు పే చేయడం ద్వారా చూపిస్తూ ఉంటాను. అయితే వారు మళ్లీ మళ్లీ నాతోనే బిల్‌ పే చేయిస్తే ఎలా. మూడు నెలల తర్వాత నేను బిల్లు కట్టాలంటే ఎలా అంటూ శృతి హాసన్‌ అసహనం వ్యక్తం చేస్తుంది. అందుకే కొన్నాళ్ల తర్వాత డేట్‌ బిల్లును షేర్ చేయడం ప్రారంభించాను. ఇప్పుడు నేను డేట్‌ కి వెళ్తే సంగం బిల్లు మాత్రమే నేను పే చేస్తాను. మిగిలిన సగం బిల్లును ఎదుటి వ్యక్తితో పే చేయిస్తాను అన్నట్లు శృతి హాసన్‌ చెప్పుకొచ్చింది.

ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు, స్నేహితులతో వెళ్లిన డేట్‌ కి బిల్లు సగం పే చేయడం ఏంటి మేడం అంటూ కొందరు కామెంట్ చేస్తే, ప్రతి విషయంలోనూ ఇంత క్లారిటీగా ఉండటం మంచి విషయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే కూలీ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రజనీకాంత్‌ తో శృతి హాసన్ ఎలాంటి సీన్స్‌లో నటించి ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందీలోనూ ఒకటి రెండు సినిమాలు, ఒక వెబ్‌ సిరీస్ లో శృతిహాసన్ నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

Tags:    

Similar News