లెజెండరీ నటుడితో అందాల కూతరు!
తండ్రి కూతుళ్ల స్నేహం, సెంటిమెంట్ వగైరా ఎప్పుడూ సినిమా కథల్లోను ప్రత్యేక ఎలిమెంట్స్.
తండ్రికి కూతురుపై ఎనలేని ప్రేమ.. కూతురికి తండ్రి అంటే అంతకుమించిన ప్రేమ. తండ్రి కూతుళ్ల అనుబంధం ఎంతో గొప్పది. తండ్రి కూతుళ్ల స్నేహం, సెంటిమెంట్ వగైరా ఎప్పుడూ సినిమా కథల్లోను ప్రత్యేక ఎలిమెంట్స్. ఇప్పుడు లెజెండరీ నటుడు కమల్ హాసన్, తన కుమార్తె శ్రుతిహాసన్ తో ఎలా ఉంటారో .. వారి మధ్య అనుబంధం ఎంతటి శక్తివంతమైనదో ఈ ఒక్క ఫోటోగ్రాఫ్ తో అందరికీ అర్థమైంది.
తండ్రి చెంతనే ఉంటే కూతురికి ఎంతటి భరోసా! అన్ని ఒడిదుడుకుల నుంచి బయటపడొచ్చు. పాపా అండదండలతో లైఫ్ ని కొత్తగా, విలక్షణంగా తీర్చిదిద్దుకునే అవకాశం మెండు. అందుకేనేమో శ్రుతిహాసన్ ఇటీవల ముంబైలో ఒంటరి జీవనానికి ప్రాధాన్యతనివ్వకుండా, చెన్నైలోనే ఎక్కువగా నివసిస్తున్నారని మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
శ్రుతి రెండుసార్లు ప్రేమలో విఫలమైంది. విదేశీ ప్రియుడు మైఖేల్ కోర్సలేతో సుదీర్ఘ ప్రేమాయణం బ్రేకప్ అయ్యాక, డూడుల్ ఆర్టిస్టు శంతను హజారికాతో కొన్నాళ్ల పాటు డేట్ చేసిన శ్రుతి అతడికి కూడా బ్రేకప్ చెప్పింది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. బ్రేకప్ ల సమయంలో కొంత డిప్రెషన్ కి గురైనా దాని నుంచి బయటపడగలగడానికి ఫ్యామిలీ బాండింగ్ ప్రధాన కారణం. ముఖ్యంగా తల్లి హారిక, తండ్రి కమల్ హాసన్ తో శ్రుతిహాసన్ ఎంతో స్నేహంగా కలిసి ఉంటారు. తన కష్టంలో ఆదుకునే కనుపాపలు వీళ్లు.
పాపా కమల్ హాసన్ తో శ్రుతి అనుబంధం ఇంకా ప్రత్యేకమైనది. ఈ ఒక్క ఫోటోగ్రాఫ్ దీనిని చెబుతోంది. అభిమానులు తమ ఆల్బమ్ లో దాచుకోదగ్గ రేర్ క్లిక్ ఇది అనడంలో సందేహం లేదు. కమల్ హాసన్ సింపుల్ గా టీషర్ట్ జీన్స్ ధరించి రేబాన్ లో స్టైలిష్ గా కనిపిస్తుండగా, శ్రుతిహాసన్ ట్రెడిషనల్ పంజాబీ డ్రెస్ ధరించి, గాగుల్స్ పెట్టుకుని చందమామలా కనిపిస్తోంది. శ్రుతి నుదుటిన దిద్దిన తిలకం సాంప్రదాయ హంగును అద్దింది. స్టైలిష్, ట్రెడిషనల్ లుక్ నిజంగా బ్లాస్ట్ అయిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ని అభిమానులు సోషల్ మీడియాల్లో వైరల్ గా షేర్ చేస్తున్నారు. తండ్రి కూతుళ్లు త్వరలో కలిసి నటిస్తే చూడాలని కూడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. శ్రుతిహాసన్ తదుపరి రజనీకాంత్ కూలీలో కనిపిస్తుంది. ఆ తర్వాత సలార్ 2 తో అలరించనుంది. విజయ్ సేతుపతితో ట్రైన్ అనే చిత్రంలోను నటిస్తోంది.