డూప్లికేట్ పేరుతో శ్రుతిహాసన్ అవకాశాల వేట
అవకాశాల కోసం ప్రయత్నించే క్రమంలో, కెరీర్ ఆరంభం అమ్మా నాన్న పేరు ఉపయోగించకుండా.. నేను నా డూప్లికేట్ పేరును ఉపయోగించానని చెప్పారు శ్రుతిహాసన్.
అవకాశాల కోసం ప్రయత్నించే క్రమంలో, కెరీర్ ఆరంభం అమ్మా నాన్న పేరు ఉపయోగించకుండా.. నేను నా డూప్లికేట్ పేరును ఉపయోగించానని చెప్పారు శ్రుతిహాసన్. కమల్ హాసన్, సారిక ఇండస్ట్రీలో పెద్ద స్టార్లు. వారి కీర్తి ప్రతిష్ఠలను ఉపయోగించుకుని అవకాశాలు పొందాలని తాను అనుకోలేదని శ్రుతిహాసన్ అన్నారు. నాది తిరుగుబాటు స్వభావం. ప్రజలు నన్ను ఒక వ్యక్తిగా పరిగణించి, నా తల్లిదండ్రుల పేరుతో నన్ను అనుసంధానించకుండా ఉండటానికి నేను డూప్లికేట్ పేరును కూడా ఉపయోగించాను అని శ్రుతి తెలిపారు.
ఇటీవల బెంగళూరులో జరిగిన మహిళా క్రికెట్ టోర్నీ- మిడ్ షో ఈవెంట్‌లో ప్రదర్శన ఇవ్వడానికి వచ్చిన నటి కం గాయని శ్రుతిహాసన్ తన జీవితంలోని బయటికి తెలియని రహస్యాలను బహిరంగంగా చెప్పారు. నా చిన్నప్పుడు నా తల్లిదండ్రులు ఫేమస్.. కానీ నేను కాదు! అని నిజాయితీగా అంగీకరించింది శ్రుతి.
కీర్తి అనేది ఎప్పటికీ నిలబడేది కాదు. ఇది చాలా అశాశ్వతమైనది. రాయిలా బరువైనది. అది మీ భుజాలను బాధించే అందమైన హ్యాండ్‌బ్యాగ్ లాంటిది. కాబట్టి మీరు కీర్తిని తేలికగా మోయాలి.. ఎందుకంటే అది నిర్దిష్టమైనది కాదు. ఎవరైనా తమ భవిష్యత్తును, కీర్తిపై ఆశలతో కలలను నిర్మించుకోగలరని అనుకుంటే అది ఆకాశంలో కోటలు కట్టడమే. నా తల్లిదండ్రులు కష్టపడి పనిచేయడం నేను చూశాను. నాన్న కష్టపడి పనిచేయడం, స్క్రిప్ట్ రాయడం, షూటింగ్‌కు వెళ్లడం, పాత్రల కోసం శిక్షణ పొందడం వంటివి చేయడం నేను చూశాను.. అని శ్రుతిహాసన్ అన్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. శ్రుతి ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. రజనీకాంత్- లోకేష్ కాంబినేషన్ మూవీ `కూలీ`లో కనిపిస్తుంది. ఆ తర్వాత సలార్ 2 తో అలరించనుంది. విజయ్ సేతుపతితో ట్రైన్ అనే చిత్రం చేస్తోంది.