శ్రుతిహాసన్.. ఆ సమస్యతో పోరాటం!
స్త్రీలకు ఉండే అనారోగ్య సమస్యల గురించి పుంఖానుపుంఖాలుగా కథనాలు అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయి
స్త్రీలకు ఉండే అనారోగ్య సమస్యల గురించి పుంఖానుపుంఖాలుగా కథనాలు అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్లో నిరంతరం ఇవి హోరెత్తుతూనే ఉంటాయి. డిజిటల్ మీడియా వల్ల ప్రజల్లో అవేర్నెస్ చాలా పెరిగింది. ఇక మెజారిటీ స్త్రీలు భరించే ఒక రెగ్యులర్ అనారోగ్య సమస్య- పిసిఒఎస్. దీనినే అధిక రక్త స్రావం అని కూడా పిలుస్తారు. రక్తం ఎక్కువగా కారిపోవడం వల్ల శారీరక బలహీనతన ఎదుర్కోవడం..!
ఈ సమస్య వల్ల ఏకాగ్రతను కోల్పోతారు. బాధ భరించలేనంతగా ఉంటుంది. ఏ పనీ చేయలేరు. ఓచోట కూచోలేరు.. నిలుచోలేరు. ఇలాంటి అరుదైన వ్యాధితో చాలా మంది ఆడవాళ్లు బాధపడుతుంటారు. ఇలాంటి అనారోగ్య సమస్య తనకు కూడా ఉందని, ఇది తనను నిరంతరం చాలా ఇబ్బందులకు గురి చేస్తోందని స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ బహిరంగంగా వెల్లడించారు. తాను పిసిఒఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) మరియు ఎండోమెట్రియోసిస్తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఇటీవల ఇన్స్టాలో తన వ్యాయామ వీడియోను షేర్ చేసిన శ్రుతి తన శీర్షికలో రెండు అనారోగ్యాలతో తన యుద్ధం గురించి పేర్కొంది. తాను చెత్త హార్మోన్ల సమస్యలను ఎదుర్కొంటున్నట్లు శ్రుతి పేర్కొంది. తన రుగ్మతల గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఫిట్నెస్ గోల్స్ ఉండాలని సూచించింది.
శ్రుతి హాసన్ పిసిఒఎస్తో తన సుదీర్ఘ పోరాటం గురించి మాట్లాడారు. ఈ అనారోగ్య సమస్య వల్ల అసమతుల్యతను ఎదుర్కొన్నాను. ఉబ్బరం జీవక్రియ సవాళ్లతో కఠినమైన పోరాటం చేయాలనేది చాలామంది మహిళలకు తెలుసు. కానీ దానిని పోరాటంగా చూసే బదులు.. సమయానికి తనడం, బాగా నిద్రపోవడం, వ్యాయామాన్ని ఆస్వాధించడం చాలా అవసరం. నా శరీరం ప్రస్తుతం పరిపూర్ణంగా లేదు.. కానీ నా హృదయం సంతోషంగా ఉండాలి. ఆ సంతోషకరమైన హార్మోన్లు ప్రవహించనివ్వండి!`` అని శ్రుతి ఇన్స్టాలో రాసారు. తనకు ఉన్న సమస్య వల్ల షూటింగుల్లోను ఇబ్బందులు తలెత్తాయని కానీ బాధను భరిస్తూనే తాను నటించేదానిని అని శ్రుతి తెలిపారు. కామెడీ సీన్లలో నవ్వించాను.. డ్యాన్స్ ఫ్లోర్ పై డ్యాన్సులు చేసాను.. చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ వాటిని దర్శకనిర్మాతలకు ఎప్పటికీ చెప్పలేను ఆ సమయంలో అని శ్రుతి వెల్లడించారు.
అయితే శ్రుతిహాసన్ వ్యక్తిగత జీవితంలో పెను సవాళ్లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి మూడు సార్లు బోయ్ ఫ్రెండ్స్ నుంచి బ్రేకప్ అయింది. తొలుత ప్రముఖ స్టార్ హీరో నుంచి విడిపోయిన శ్రుతి హాసన్ ఆ తర్వాత విదేశీ ప్రియుడు మైఖేల్ కోర్సలే నుంచి విడిపోయింది. ఇటీవలే డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారిక నుంచి బ్రేకప్ అయ్యి ఒంటరిగా ఉన్నానని ప్రకటించింది. నేను సింగిల్.. మింగిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాను! అంటూ కవిత్వం కూడా రాసింది.