కొత్త లవ్ లైఫ్ గురించి స్టార్ హీరోయిన్
చాలా మంది సెలబ్రిటీల్లానే శృతి హాసన్ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది
చాలా మంది సెలబ్రిటీల్లానే శృతి హాసన్ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ భామ తన ఫాలోవర్స్ తో కల్మషం దాపరికం లేకుండా నిజాయితీగా అన్ని విషయాలను షేర్ చేస్తుంది. ఇటీవల తన గతం గురించి శ్రుతి ప్రస్థావించింది. ఇందులో తన మాజీ గురించి మాట్లాడుతోందని చాలా మందికి అర్థమైంది.
శ్రుతి సోషల్ మీడియా క్యాప్షన్‌లో ఇలా రాసింది. ``నేను ఎన్నడూ వెనక్కి తిరిగి చూడను కానీ నేను అలా చేసినప్పుడు.. నేను ముందుకు వెళ్లి కోరుకున్నదంతా చేసినందుకు చాలా ఆనందిస్తాను`` అని వ్యాఖ్యానించింది. శ్రుతి ఎవరి పేరును స్పష్టంగా ప్రస్తావించనప్పటికీ.. శంతనుతో విడిపోయినా దానికి తాను కలత చెందడం లేదని.. తాను చేయాలనుకున్నవి చేశానని చెబుతోందని అర్థమైంది. చెడు కంటితో ఎవరినీ చూడొద్దని అభిమానులను కోరిన శ్రుతి.. ఎవరిని చూసి బాధపడకు.. సంతోషంగా ఉండు. అద్భుతంగా అనిపిస్తుంది! అని తన ఇన్‌స్టాలో షేర్ చేసారు.
శృతి హాసన్ ఇటీవల ఆర్టిస్ట్ శంతను హజారికా నుంచి విడిపోయింది. COVID-19 మహమ్మారి సమయంలో డేటింగ్ ప్రారంభించిన ఈ జంట వ్యక్తిగత విభేదాల కారణంగా ఏప్రిల్ 2024లో విడిపోయారు. ఆ తర్వాత శ్రుతి ఏప్రిల్ 16న సోషల్ మీడియాల్లోకి తిరిగి రావడానికి ముందు ఏప్రిల్‌లో చాలా కాలం పాటు MIA (మిస్సింగ్ ఇన్ యాక్షన్)కి కూడా వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత తన బ్రేకప్ గురించి వరుస కథనాలను పోస్ట్ చేసింది. ఆ సమయంలో నా జీవితం రీ-కాన్ఫిగరింగ్ చేసే దశలో ఉందని శ్రుతి పేర్కొంది. శ్రుతి తన అనుచరులకు వారు ఎవరూ (మాజీ ప్రియులు) క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
దాదాపు నాలుగేళ్ల పాటు శాంతను హజారికాతో సహజీవనం చేసిన తర్వాత శృతి హాసన్ బంధం ముగిసింది. మూడు నెలల క్రితం ఈ జంట విడిపోయినట్టు కథనాలొచ్చాయి. తాను ఒంటరిగా ఉన్నానని, అయితే ఎవరితోను మింగిల్ అవ్వడానికి ఇంకా సిద్ధంగా లేనని తెలిపింది. గతంలో శ్రుతిహాసన్ హీరో సిద్ధార్థ్ తో డేటింగ్ చేసినా బ్రేకప్ అయింది. ఆ తర్వాత విదేశీ మైఖేల్ కోర్సలేతో ప్రేమలో పడింది. అతడితోను బ్రేకప్ అనంతరం శంతను హజారికతో డేటింగ్ చేసింది. ఇటీవలే ఈ జంట కూడా చివరికి బ్రేకప్ అయింది. సోషల్ మీడియాల్లో శ్రుతి తాజా సందేశం అభిమానుల్లో చర్చగా మారింది. తన పాత పరిచయాలు బ్రేకప్ లతో తాను కలత చెందనని శ్రుతి సందేశం ఇస్తోందా? త్వరలోనే కొత్త లవ్ లైఫ్ కి శ్రీకారం చుడుతుందా? అంటూ అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.