శ్రుతి హాసన్ కి ఆ ఉద్దేశమే లేదా?
విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ నటిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే
విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ నటిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అమ్మడు మ్యాకప్ వేసుకోవడానికి ముందే సంగీతంలో ఆరితేరింది. సింగర్ గానూ ఎంతో ఫేమస్. మ్యూజిక్ బ్యాండ్ ని నిర్వహించింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. ఇలా అన్ని రంగాల్లోనూ ఆరితేరి తండ్రికి తగ్గ తన అనిపించింది. ఇండస్ట్రీలో మల్టీట్యాలెంటెడ్ బ్యూటీ ముందుకు సాగిపోతుంది.
చిన్న నాటి నుంచి సినిమా వాతావంరణం లో పెరగడంతో! శ్రుతి హాసన్ నటిగా ఎంట్రీ ఇవ్వడం అన్నది ఆశ్చర్యపోయే విషయం కూడా కాదు. కళ్ల ముందు అవకాశాలు..ఫేం..ఫాలోయింగ్ వస్తుందంటే? ఆ రంగాన్ని అంత ఈజీగా వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ శ్రుతి హాసన్ ఆ టైప్ కాదంటోంది. సినిమా అనేది తన దృష్టిలో ఎప్పుడూ సెకెండ్ ఛాయిస్ గానే ఉంటుందంది.
సంగీతానికి సినిమా ముడిపడి ఉంటడంతో మ్యాకప్ వేసుకుంది తప్ప! లేకపోతే నటిగా ఇటువైపు తన ప్రయాణం ఉండేది కాదేమో నన్న సందేహం వ్యక్తం చేసింది. `తొలుత సినిమాల్లోకి రావాలన్నది నా ఉద్దేశం కాదు. కేవలం సంగీతం మాత్రమే ఆసక్తి. కానీ సినిమాకి సంబంధించిన ఫీల్డ్ కావడంతో నటిగా మ్యాకప్ వేసుకున్నాను. సినిమా-సంగీతం మధ్య ఆ రిలేషన్ లేకపోతే కేవలం సంగీతంవైపే ఉండేదాన్ని.
కానీ సినిమాల్లోకి వచ్చాక నటికి ఎంత ఆదరణ దక్కుతుందో? అన్నది కాలక్రమంలో అర్దమైంది. అప్పటి నుంచి సంగీతాన్ని ఎంతగా ప్రేమించానో? నటన కూడా అంతే ప్రేమించడం మొదలు పెట్టాను. ప్రస్తుతం రెండు రంగాలు నాకు రెండు కళ్లు లాంటివి` అని అంది. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీ నటిగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.