మంచి వంటకం.. మంచి సినిమా.. ఏం చెప్పారు మేడం..!

సో మంచి సినిమాను మంచి వంటకం తో పోల్చుతూ శృతి హాసన్ ఇచ్చిన ఎక్స్ ప్లేనేషన్ మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటుంది.

Update: 2024-08-23 06:30 GMT

సినిమాల్లో కేవలం హీరోలు మాత్రమే ఉంటే ప్రేక్షకులు చూస్తారా.. అంటే కొన్ని కథలు కేవలం స్టోరీ టెల్లర్స్ గా వస్తే చెప్పలేం కానీ కమర్షియల్ సినిమాల్లో మాత్రం హీరోయిన్ కంపల్సరీ గా ఉండాలి. ఐతే వారి స్క్రీన్ టైం విషయంలో కొంతమందికి అభ్యంతరాలు ఉంటాయి. సినిమాలో హీరోయిన్ ఎంత ఇంపార్టెంట్ అయినా స్క్రీన్ టైం విషయంలో హీరోల డామినేషన్ ఉంటుంది. వీటిపై ఒక్కో హీరోయిన్ ఒక్కోలా స్పందిస్తుంటారు. ఐతే తనకు మాత్రం అలాంటి అభ్యంతరాలు ఏమి లేవని స్పష్టంగా వెల్లడించింది కమల్ గారాల పట్టి స్టార్ హీరోయిన్ శృతి హాసన్.

కెరీర్ స్టార్టింగ్ లో హిట్టు కోసం కాస్త ఇబ్బంది పడ్డా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన శృతి హాసన్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ సినిమాల్లో నటిస్తూనే తన అభిరుచి చూపిస్తూ స్పెషల్ సినిమాలు చేస్తూ వచ్చింది శృతి హాసన్. ఐతే సినిమాల్లో తన పాత్ర నిడివి గురించి తాను పెద్దగా ఆలోచించనని అంటుంది శృతి హాసన్. కమర్షియల్ సినిమాల్లో ముఖ్యంగా హీరోయిన్ పాత్ర తక్కువ ఉంటుందని అంటుంటారు. తన వరకు సినిమాకు ఏది అవసరం ఎంత అవసరమో అంత ఉంచుతారని అంటుంది శృతి హాసన్.

ఆమె నటించిన ప్రభాస్ సలార్ సినిమాలో శృతి హాసన్ స్క్రీన్ టైం తక్కువ ఉందన్న టాక్ వినిపించింది. ఐతే దీనిపై స్పందించిన శృతి హాసన్ ఒక సినిమాకు సైన్ చేసే టైం లో చాలా అంశాలు పరిగణిస్తానని అంటుంది. కమర్షియల్ హంగులు ఉన్నాయా లేదా అన్నది చూస్తా.. కొన్ని సినిమాల్లో స్క్రీన్ టైం తక్కువ ఉన్నా సూపర్ హిట్ అయ్యాయి. కొన్ని స్క్రీన్ టైం ఎక్కువ కనిపించినా ఫ్లాప్ అయ్యాయి. అందుకే పాత్రల నిడివి పై తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అంటుంది శృతి హాసన్. సలార్ సినిమా లో తన పాత్రపై ఎలాంటి ఫిర్యాదులు లేవని అంటుంది శృతి హాసన్.

అంతేకాదు మంచి వంటకం తయారవ్వాలంటే అన్నీ సమపాళ్లలో ఉండాలి. సో అలానే కమర్షియల్ సినిమాలో ఏది ఎలా ఉండాలన్నది మేకర్స్ నిర్ణయిస్తారని చెప్పింది. సో మంచి సినిమాను మంచి వంటకం తో పోల్చుతూ శృతి హాసన్ ఇచ్చిన ఎక్స్ ప్లేనేషన్ మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో అడివి శేష్ తో డెకాయిట్ సినిమాలో నటిస్తుంది. కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీలో కూడా భాగం అవుతుంది.

Tags:    

Similar News