శ్రుతిహాస‌న్ - శంత‌ను హ‌జారికా మ‌ధ్య ఓర్రీ!

శ్రుతి గురించి ఓ చాటింగ్ సెష‌న్ లో ప్ర‌స్థావిస్తూ శంతనుని 'ఆమె భర్త' అని పేర్కొనడంతో ఇంటర్నెట్ లో అగ్గి రాజుకుంది.

Update: 2023-12-27 09:38 GMT

అందాల క‌థానాయిక శ్రుతిహాస‌న్ త‌న ప్రియుడు శంత‌ను హ‌జారికాను ర‌హ‌స్యంగా పెళ్లాడిందా? పెళ్లి విష‌యాన్ని ఈ జంట దాచేసారా? అంటే .. అవున‌నే నెటిజ‌నుల్లో ప్ర‌చారం సాగుతోంది. శ్రుతి- శంత‌నుల‌కు ట‌చ్ లో ఉన్న ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్ర‌త‌మ‌ణి తాజా కామెంట్ తో ఈ జంట పెళ్ల‌యింద‌ని అభిమానులు భావిస్తున్నారు. అస‌లింత‌కీ ఆ ముగ్గురి న‌డుమా ఏం జ‌రిగింది? ఈ పుకార్‌లో నిజం ఎంత‌? అన్న‌ది తెలియాలంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

శ్రుతిహాస‌న్- డూడుల్ ఆర్టిస్ట్ శంత‌ను హ‌జారికా జంట చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట అన్యోన్య‌త జంట షికార్ల గురించి ఎలాంటి దాప‌రికాల్లేవ్. ఆల్మోస్ట్ భార్యాభ‌ర్త‌ల్లా క‌నిపిస్తారు. కానీ భార్యా భ‌ర్త‌లు కాలేదు ఇంకా. ఇప్పుడు ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఓర్హాన్ అవత్రామణి అకా ఓర్రీ త‌ల‌దూర్చాడు. శ్రుతి గురించి ఓ చాటింగ్ సెష‌న్ లో ప్ర‌స్థావిస్తూ శంతనుని 'ఆమె భర్త' అని పేర్కొనడంతో ఇంటర్నెట్ లో అగ్గి రాజుకుంది. ఈ జంట రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వెంట‌నే ఆన్‌లైన్‌లో పుకార్లు వైరల్‌గా మారాయి. ఇప్పుడు ప్రేమపక్షులు తమ వ్యక్తిగత సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో దీనిపై స్పందించారు.

పెళ్లి పుకార్లపై శృతి హాసన్, శాంతను హజారికా స్పందించారు. నిన్న బాలీవుడ్ లో అందరితో స్నేహంగా ఉండే సోషల్ మీడియా వ్యక్తి ఓర్రీ రెడ్డిట్‌లో 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్‌ను నిర్వ‌హించాడు. ఓ కార్యక్రమంలో శృతి హాసన్ తనతో అసభ్యంగా ప్రవర్తించిందని ఈ సెషన్‌లో వెల్లడించాడు. దాంతో పాటు శాంతాను హజారికాను ఆమె భర్త అని సంబోధించాడు. అత‌డి వ్యాఖ్య విన్న వెంట‌నే నెటిజ‌నులు ఈ జంట‌ రహస్యంగా వివాహం చేసుకున్నారనే పుకార్లను వైర‌ల్ చేసారు. అయితే ఈ వార్త‌లేవీ నిజాలు కాదు, శాంతించండి అంటూ శ్రుతిహాస‌న్ సోషల్ మీడియాలో వారించింది. తన ఇన్‌స్టాగ్రామ్ లో వ్యాఖ్యానిస్తూ.. "నాకు పెళ్లి కాలేదు. ప్రతి విషయం గురించి బహిరంగంగా చెప్పే వ్యక్తికి తెలియ‌కుండా నేను దీన్ని ఎందుకు దాస్తాను? LOL. కాబట్టి నాకు తెలియని వ్యక్తులు దయచేసి శాంతించండి" అని ఓర్రీపై సెటైరిక‌ల్ గా స్పందించింది. "మీరు శాంతించాలి! మాకు పెళ్లి కాలేదు. మాకు తెలియని వ్యక్తులు, దయచేసి పుకార్లు వ్యాప్తి చేయడం ఆపండి" అని శంత‌ను కూడా ప్ర‌తిస్పందించాడు.

ఓర్రీ ఈ జంట‌ గురించి ఏమ‌న్నాడు? అంటే.. తన అభిమానులతో సంభాషణ సందర్భంగా ఫోటోల‌కు పోజులిచ్చేటప్పుడు మీతో స‌రిగా లేని ప్రముఖులెవరైనా ఉన్నారా? అని ఓర్రీని ప్ర‌శ్నించారు. దానికి ఆయన సమాధానమిస్తూ 'శృతిహాసన్' పేరు చెప్పాడు. నేనెప్పుడూ ఆమెను దేని గురించి అడగలేదు. చాలా బాధగా అనిపించింది. కానీ నేను ఆమె భర్తతో మంచిగా ఉన్నాను. నేను అతడిని ఆరాధిస్తాను. ఈ విష‌యం సకాలంలో పరిష్కృత‌మ‌వుతుంది. అయితే ఆమె (శ్రుతి) నన్ను స్పాట్ బాయ్ అని.. పుణె! అని కామెంట్ చేసిందని రూమర్లు వ‌చ్చాయి అని తెలిపాడు.

Tags:    

Similar News