ఇలా బౌన్స్ బ్యాక్ ఏ భామకి సాధ్యం?
ఆమెలో ప్రతిభని మెచ్చే అవకాశాలు కల్పిస్తున్నారని మరోసారి రుజువైంది. ప్రస్తుతం శ్రుతి హాసన్ కెరీర్ పరంగా పుల్ బిజీగా ఉంది.
పడి లేవడం అన్నది అనుకున్నంత వీజీ కాదు. ఎంతో కమిట్ మెంట్..డెడికేషన్ ఉంటే తప్ప బౌన్స్ బ్యాక్ చెప్పినంత సులభం కాదు. కమల్ హాసన్ గారాల పట్టి అలా పడిలేచిన కెరటం అనడంలో ఎలాంటి సందేహం లేదు. సౌత్ ఇండస్ట్రీలో కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో మైఖెల్ కోర్సలేతో ప్రేమలో పడటం తో అమ్మడు సినిమాలు ఎంతలా అశ్రద్ద చేసిందో తెలిసిందే. అతడి మత్తులో పడి వచ్చిన ఎన్నో అవకాశాల్ని వదులకుంది. ఎన్నో బాలీవుడ్ అవకాశాలు సైతం కోల్పోయింది.
అటుపై అతడితో బ్రేకప్ తర్వాత మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టి సక్సెస్ అయింది. అలాగని ప్రేమకి వ్యతిరేకం కాలేదు. మళ్లీ ప్రేమలో పడింది. అయితే ఈసారి ఎంతో బ్యాలెన్స్ గా ముందుకెళ్తుంది. ప్రియుడు- సినిమాల్ని వేరు చేసి ప్రత్యేకమైన టైమ్ కేటాయించి ముందుకు వెళ్తుంది. లక్కీ గా బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రోసస్ లో అమ్మడికి అన్ని విజయాలు దక్కడం విశేషం. ఆమె చేసిన సినిమాలు వరుసగా విజయం సాధించడంతో ఎంత వేగంగా గ్రాప్ పడిపోయిందో? అంతే వేగంగా మెరుగు పడింది.
అందుకే నేడు శ్రుతి హాసన్ మళ్లీ అవకాశాలు అందుకోగల్గుతుంది. విశ్వనటుడి కుమార్తె అని ఇక్కడ అవకాశాలు ఎవరూ పిలిచి ఇవ్వడం లేదు. ఆమెలో ప్రతిభని మెచ్చే అవకాశాలు కల్పిస్తున్నారని మరోసారి రుజువైంది. ప్రస్తుతం శ్రుతి హాసన్ కెరీర్ పరంగా పుల్ బిజీగా ఉంది. 'సలార్ -2' లో నటిస్తుంది. మొదటి భాగంలో కథ మలుపు తిప్పిన పాత్ర ఇదే అయినా...ఆ తర్వాత అదే రోల్ స్టోరీ నేరేషన్ కి పరిమితమైంది. అయితే రెండవ భాగంలో ఆ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందని సమాచారం.
ఇక సమంత చేయాల్సిన 'చెన్నై స్టోరీ' వెతుక్కుంటూ మరీ శ్రుతిహాసన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. మరి ముందు సమంత కమిట్ అయి ఎందుకు ఎగ్జిట్ అయినట్లు అంటే? ఆమె అనారోగ్యం సహా డేట్లు సర్దుబాటు కూడా కుదరకపోవడంతో సామ్ తప్పుకోవడంతో శ్రుతి ఎంటర్ అయింది. అలాగే అడవి శేష్ తో 'డెకాయిట్' అనే సినిమా కూడా చేస్తోంది. ఇంకా కొన్ని ఫైనల్ చేయాల్సిన ప్రాజెక్ట్ లు కూడా ఉన్నాయట. ఇలా ఇన్ని సినిమాలతో శ్రుతిహాసన్ బిజీగా ఉండటంతో ఇండస్ట్రీలో టైమ్ నడుస్తున్నట్లు కనిపిస్తుంది.