తెలుగు సినీ సెట్స్ లో శ్వేతా బసుకు అవమానం
కొత్త బంగారు లోకం మూవీతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్వేతాబసు ప్రసాద్ మొదటి సినిమాతోనే యూత్ కు బాగా దగ్గరైంది.
కొత్త బంగారు లోకం మూవీతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్వేతాబసు ప్రసాద్ మొదటి సినిమాతోనే యూత్ కు బాగా దగ్గరైంది. ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ వచ్చినప్పటికీ ఆ తర్వాత అమ్మడికి పెద్దగా ఛాన్సులు రాలేదు. వచ్చిన కొన్ని అవకాశాలను కూడా తప్పటడుగులేసి ఫ్లాపులను కొని తెచ్చుకుంది.
కొన్నేళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైన శ్వేత బసు ప్రసాద్ ప్రస్తుతం హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలో రాణిస్తుంది. తాను నటించిన ఊప్స్ అబ్ క్యా అనే వెబ్ సిరీస్ ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది. ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా శ్వేత టాలీవుడ్ లో పడిన ఇబ్బందుల గురించి వెల్లడించింది. శ్వేతా బసు ప్రసాద్ ఒక తెలుగు సినిమా సెట్ లో వేధింపులకు గురైనట్టు ఆమె గుర్తు చేసుకుంది.
కొన్నేళ్లుగా సినిమాలు చేస్తూ వస్తున్న శ్వేతా బసు ప్రసాద్ ఓ తెలుగు సినిమా సెట్స్ లో చాలా ఇబ్బందులకు గురైనట్టు తెలిపింది. తన హైట్ 5.2 అడుగులని, ఆ హీరో ఆరు అడుగులుంటాడని దీంతో హీరోతో పోలుస్తూ తనని ఎత్తు తక్కువగా ఉన్నందుకు సెట్ లో ప్రతి ఒక్కరూ ఎగతాళి చేసేవారని, ఆయన అంత ఎత్తు ఉంటే ఈవిడ మాత్రం 5 అడుగులే ఉందని కామెంట్స్ చేసేవారని వెల్లడించింది.
తన హైట్ మీద ఆ హీరో కూడా కామెంట్ చేసేవాడని, ప్రతి రోజూ తన ఎత్తును గుర్తు చేస్తూ కామెంట్ చేసేవాడని, షూటింగ్ టైమ్ లో కూడా తాను చేసిన ప్రతీ సీన్‌ను మారుస్తూ ఉండేవాడని, కావాలని రీటేక్స్ చేయించేవాడని, తెలుగు వాడే అయినప్పటికీ ఆయనకు తెలుగు సరిగా రాదని, సెట్స్ లో ఎవరికీ ఆయని భాష అర్థం కాదని తెలిపింది.
తాను తెలుగమ్మాయి కాకపోయినా ఎలాగొలా తెలుగు నేర్చుకుని డైలాగ్స్ చెప్పేదాన్నని, ఆ హీరో తెలుగు వాడే అయినప్పటికీ డైలాగ్స్ సరిగా చెప్పేవాడు కాదని, అయినా అతని గురించి ఎవరూ పట్టించుకునే వారు కాదని, తన విషయంలో మాత్రం కంట్రోల్ లో లేని హైట్ గురించి కామెంట్ చేసేవాళ్లని, తాను ఇప్పటివరకు ఇబ్బంది పడిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ఆ సినిమానేనని శ్వేతా తెలిపింది. అయితే ఇదంతా ఏ సినిమా టైమ్ లో అనేది మాత్రం శ్వేత చెప్పలేదు. ఇదిలా ఉంటే కొత్త బంగారు లోకం తర్వాత రైడ్, కాస్కో, కలవర్ కింగ్, ప్రియుడు, జీనియస్ సినిమాల్లో శ్వేత నటించింది.