ఈమె ఎవరో గుర్తు పట్టగలరా?
మొదటి సినిమా తోనే మంచి గుర్తింపు దక్కించుకున్నా కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో పెద్దగా టాలీవుడ్ లో ఆఫర్లు దక్కించుకోలేక పోయింది.
నటీనటులు తమ పాత్రల్లో ఒదిగి పోయేందుకు కొన్ని సార్లు పూర్తి విరుద్ధమైన లుక్ లో కనిపించడం మనం చూస్తూ ఉంటాం. హీరోలు కొత్తగా కనిపించేందుకు గాను వర్కౌట్స్ చేస్తూ సిక్స్ ప్యాక్ బాడీని ట్రై చేస్తారు. అయితే హీరోయిన్స్ మేకోవర్ తో మాయ చేస్తారు.
చాలా మంది హీరోయిన్స్ ఎక్కువగా గ్లామర్ రోల్స్ కే పరిమితం అవుతూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు వారు డీ గ్లామర్ లుక్ లో కనిపించి సర్ ప్రైజ్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్ లుక్ లో చూసి వారిని డిఫరెంట్ ఔట్ ఫిట్ లో లేదా డీ గ్లామర్ గా చూసి చాలా మంది అవాక్కవుతూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?
ఈమె వరుణ్ సందేశ్ నటించిన సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా తోనే మంచి గుర్తింపు దక్కించుకున్నా కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో పెద్దగా టాలీవుడ్ లో ఆఫర్లు దక్కించుకోలేక పోయింది. పై పెచ్చు కొన్ని వివాదాల వల్ల ఈమె కెరీర్ ఇబ్బందుల్లో పడ్డట్టు అయ్యింది.
ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఈమెను ఇప్పటికే గుర్తు పట్టి ఉంటారు. ఈమె మరెవ్వరో కాదు కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్. నటిగా ఈ మధ్య కాలంలో నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలు చేస్తూ నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
గ్లామర్ లుక్ లో శ్వేత బసు ప్రసాద్ ను చూసిన నెటిజన్స్ ఈ లుక్ లో ఆమెను చూసి అవాక్కవుతున్నారు. బాబోయ్ ఏంటి ఇంత మార్పు అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక సినిమాలో రత్న అనే పాత్రలో ఈమె నటిస్తోంది. రత్న ఇలా ఉంటుంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.