ప్రభాస్ పెళ్లిపై మరోసారి క్లారిటీ
పలు సందర్భాల్లో ప్రభాస్ వివాహం గురించి అతడి మాతృమూర్తి అయిన కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి మాట్లాడారు.
ప్రభాస్ అభిమానుల మైండ్ లో తిరిగే ఒకే ఒక్క చిక్కు ప్రశ్న ఏది? అంటే అది అతడి వివాహం. ప్రభాస్ పెళ్లెప్పుడు? దీనికి సమాధానం చాలా కాలంగా లేనే లేదు. డార్లింగ్ వ్యక్తిగత జీవితం దశాబ్ధ కాలంగా తీవ్ర పరిశీలనలో ఉంది. పలు సందర్భాల్లో అతడి పెళ్లి గురించి బరువైన ప్రకటనలు వచ్చినా కానీ, ఏవీ నిలబడలేదు. పెదనాన్న కృష్ణంరాజు అతడి పెళ్లి చూడాలని కలలుగనేవారు. కానీ అది వీలుపడలేదు. ఆయన తొందరపడి ముందే కాలం చేసారు.
కారణం ఏదైనా కానీ ప్రభాస్ పెళ్లి అనే అంకానికి దూరంగా ఉన్నాడు. అతను ఎవరిని పెళ్లి చేసుకుంటాడో అనే విషయంపై అందరూ ఆందోళన చెందుతూనే ఉన్నారు. పలు సందర్భాల్లో ప్రభాస్ వివాహం గురించి అతడి మాతృమూర్తి అయిన కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి మాట్లాడారు. ఇప్పుడు మరోసారి విజయవాద దుర్గమ్మ తల్లి సాన్నిథ్యంలో ప్రభాస్ పెళ్లి గురించిన ప్రశ్నను మీడియా నుంచి ఎదుర్కొన్న శ్యామలాదేవి దానికి సమాధానమిచ్చారు.
అమ్మ ఆశీస్సులు ఉన్నాయి. పెదనాన్న కృష్ణంరాజుగారి ఆశీస్సులు బాబుకు ఎప్పుడూ ఉన్నాయి. త్వరలోనే పెళ్లవుతుంది. ఆరోజు వస్తుంది.. మీరే చూస్తారు. మీడియాను ఆహ్వానిస్తాం.. అని అన్నారు. అయితే శ్యామలాదేవిగారు ఆమ్మవారి ఆశీస్సులు అందుకుని ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్థావించారు కాబట్టి ఈసారి ఖాయమేనని భావించవచ్చు. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజా సాబ్ తర్వాతా వరుస కమిట్ మెంట్లు ఉన్నాయి. అందువల్ల అతడి పెళ్లి గురించి తనకు ఎంత స్పష్ఠత ఉందో వేచి చూడాలి.