ప్రభాస్ పెళ్లి బట్టల షాప్ ఫిక్సైంది!
ఆలు లేదు..చూలు లేదు కొడుకు పేరు అదేదో! అన్నట్లు ఉందీ సమాచారం.
ఆలు లేదు..చూలు లేదు కొడుకు పేరు అదేదో! అన్నట్లు ఉందీ సమాచారం. ప్రభాస్ కి ఇంకా పిల్ల దొరకలేదు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో చెప్పలేదు. కానీ పెళ్లి బట్టలు మాత్రం ఇక్కడే కొంటామంటూ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి రివీల్ చేసారు. జూబ్లిహిల్స్ లోని ఓ బట్టల దుకాణాన్ని శ్యామలా దేవి లాంచ్ చేసారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ` ప్రభాస్ పెళ్లి బట్టలు ఇక్కడే కొంటాం. నాకు కంచి పట్టు చీరలంటే చాలా ఇష్టం. ఇక్కడ అన్ని రకాల వెరైటీ చీరలు దొరుకుతున్నాయి.
పెళ్లిళ్లకు, ఇంతర వేడుకలకు ఇక్కడ షాపింగ్ చేయోచ్చు. మహిళలు కోరుకునే అన్నిరకాల జరివరం కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి` అన్నారు. ఇదంతా ఒకే గానీ పెద్దమ్మ ఇలా డార్లింగ్ పెళ్లి గురించి చెప్పడంతో ఆషాప్ పై అందరి దృష్టి పడింది. ఆషాప్ ఎక్కడా? అన్న ఆరాలు అప్పుడే మొదలైపోయాయి. అది పక్కన బెడితే ప్రభాస్ పెళ్లి అన్ని పెద్ద మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. పెళ్లి గురించి అడిగితే ప్రభాస్ నో కామెంట్ అనేసి సైలెంట్ గా వెళ్లిపోతాడు.
పెళ్లి ఎప్పుడు అంటే టైమ్ వచ్చినప్పుడని కొన్ని సందర్బల్లో చెప్పాడు. అతడి పెళ్లి నెట్టింట ఎప్పుడూ హాట్ టాపిక్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని వందల , వేల కథనాలు వైరల్ అయ్యయి. కానీ అందులో ఏదీ నిజం కాలేదు. ప్రస్తుతం ప్రభాస్ దృష్టి అంతా సినిమాలపైనే ఉంది. ఉంటే షూటింగ్ సెట్ లో ఉంటాడు. లేదంటే విదేశాల్లో...ఆ రెండు చోట్లా లేడంటే ఇంట్లో ఉంటాడు. కొంత కాలంగా ప్రభాస్ షెడ్యూల్ ఇలాగే కనిపిస్తుంది.
ఇటీవలే `సలార్`, `కల్కీ 2898` తో రెండు భారీ విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రాజాసాబ్` లో నటిస్తున్నాడు. ఇది కామెడీ ఎంటర్ టైనర్. మరి ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ నేపథ్యంలో అన్ని చోట్లా రిలీజ్ చేస్తారా? కొన్ని చోట్లే పరిమితం చేస్తారా? అన్నది చూడాలి. అలాగే డార్లింగ్ లైనప్ లో మరికొన్ని సినిమాలున్నాయి.