యుధ్రా టాక్ ఎలా ఉంది..?
బాలీవుడ్ లో వెరైటీ కథలతో సత్తా చాటుతున్న సిద్ధాంత్ చతుర్వేది లీడ్ రోల్ లో మాళవిక మోహనన్ హీరోయిన్ గా వచ్చిన సినిమా యుధ్రా.
బాలీవుడ్ లో వెరైటీ కథలతో సత్తా చాటుతున్న సిద్ధాంత్ చతుర్వేది లీడ్ రోల్ లో మాళవిక మోహనన్ హీరోయిన్ గా వచ్చిన సినిమా యుధ్రా. రవి ఉద్యవార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన యుధ్రా కథ ఏంటి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడం లో సక్సెస్ అయ్యిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన యుధ్రా రాథోడ్ (సిద్ధాంత్ చతుర్వేది)ని తండ్రి స్నేహితుడు రెహ్మాన్ (రామ్ కపూర్) పెంచి పెద్ద చేస్తాడు. యుధ్రా కు విపరీతమైన కోపం ఉంటుంది. అదే తన బలహీనత కూడా.. ఐతే దాన్ని సమాజానికి ఉపయోగపడేలా చేయాలని రెహ్మాన్ అతనికి డ్రగ్ మాఫియా నడిపించే ఫిరోజ్ (రాజ్ అర్జున్) ని టార్గెట్ పెట్టి అతని పతనం చూడాలని టాస్క్ ఇస్తాడు. ఈ క్రమంలో ఫిరోజ్ కొడుకు (రాఘవ్ జుయల్) తో యుధ్రా శతృత్వం స్టార్ట్ అవుతుంది. ఇక ఈ ఇద్దరి మధ్య ఫైట్ ఎలా నడిచింది అన్నది సినిమా కథ.
యుధ్రా రొటీన్ కథ కథనాలతో తెరకెక్కించారు. యాక్షన్ బ్లాక్స్ బాగున్నా వాటిని నడిపించే ఎమోషన్ అసలు వర్క్ అవుట్ కాలేదు. లవ్ స్టోరీ అసలు ఏమాత్రం వర్క్ అవుట్ కాలేదు. బాగా పండాల్సిన ఫాదర్ సెంటిమెంట్ కూడా అసలు ఇంప్రెస్ చేయలేదు. రెగ్యులర్ రివెంజ్ డ్రామాగానే సినిమా వచ్చినా ఎక్కడ ప్రేక్షకులను కథకు కనెక్ట్ అయ్యేలా చేయలేదు. మాస్ ఆడియన్స్ నచ్చే యాక్షన్ పార్ట్ ఉన్నా దాని కోసం మాత్రమే సినిమా మొత్తం భరించే ఛాన్స్ లేదు.
మాళవిక మోహనన్ మొదటి బాలీవుడ్ సినిమాగా యుధ్రా పై చాలా హోప్స్ పెట్టుకుంది. అమ్మడు ఇదివరకు విజయ్ తో మాస్టర్, రజినికాంత్ తో పేట సినిమా చేసింది. విక్రం తంగలాన్ లో చేసినా పెద్దగా పేరు రాలేదు. ఐతే యుధ్రాలో అమ్మడు గ్లామర్ గా కనిపించింది. నెక్స్ట్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తుంది. యుధ్రాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాళవిక ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని చెప్పొచ్చు. సిద్ధాంత్ చతుర్వేది యాక్షన్ బాగున్నా సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే రెండు కూడా చాలా రొటీన్ గా సాగడం వల్ల తెర మీద ఎమోషన్ వర్క్ అవుట్ కాలేదు.