ప్రేక్షకులు సిద్దార్ధ్ సూటి ప్రశ్న!
మంచి కథలతో కొన్ని చిత్రాలు వస్తున్నప్పటికి వాటికి మన దేశంలో సరైన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన చెందారు.
నటుడు సిద్దార్ధ్ సినిమాలకంటే? వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ మధ్య సంచలనమవుతోన్న సంగతి తెలిసిందే. వివిధ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ మీడియాలో హైలైట్ అవుతున్నాడు. తాజాగా దక్షిణాది, బాలీవుడ్ కు చెందిన నిర్మాతలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిద్దార్ధ్ అవార్డు చిత్రాలను ప్రేక్షకులు ఎందుకు చూడటం లేదని సూటి ప్రశ్న వేసారు. మంచి కథలతో కొన్ని చిత్రాలు వస్తున్నప్పటికి వాటికి మన దేశంలో సరైన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన చెందారు.
అందుకు పాయల్ కపాడియా తెరకెక్కించిన 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' చిత్రాన్ని ఉదహరించారు. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకుంది. మన దేశంలో మాత్రం ఈ సినిమాను ఎవరూ చూడ లేదన్నారు. 'పాయల్ కపాడికి చెందిన ఓ వీడియో చూసాను. అందులో ఆమె తన సినిమా గురించి ప్రేక్షకులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే సినిమాను చూడాలని ప్రేక్షకులు కోరికని వ్యక్తం చేసారు.
కానీ అందుకు పాయల్ కపాడియా చెప్పిన సమాధానం చూసి షాక్ అయ్యాను. సినిమా విడుదలైన ప్రేక్షకులకు అనుకున్న స్థాయిలో రాకపోవడానికి కారణం ఎక్కువ థియేటర్లు దొరక్కపోవడం... సవ్యంగా ఆడించకుండా తీసే యడంతోనే ఆ పరిస్థితి వచ్చిందన్నారు. ఆమె సమాధానంతోనే నేను షాక్ అయ్యాను. మంచి చిత్రాలు ఇలాగే కిల్ అవుతున్నాయన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే అవార్డు చిత్రాలకు దేశంలో ఆదరణ లేదన్నది వాస్తవం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డు లందుకున్న చాలా చిత్రాలు కమర్శియల్ గా ఆడినవి కాదు. వాటిలో కమర్శియల్ కంటెంట్ ఉంటదు. అలాంటి కంటెంట్ ఉంటే? అవార్డుకు ఎంపిక కాదు. ఎక్కువగా మలయాళ చిత్రాలకు అవార్డులొస్తుంటాయి. దేశం నుంచి ఆస్కార్ నామినేషన్స లో మలయాళ చిత్రాలదే హవా కనిపిస్తుంది.