తెల్లారి నిద్ర చెడ‌గొడుతోంది..! భార్య‌పై సిద్ ఫిర్యాదు!!

మొన్న‌నే పెళ్ల‌యిన జంట‌... జీవితాన్ని రోమాంచితంగా ఎంజాయ్ చేస్తోంది.

Update: 2024-09-19 08:01 GMT

మొన్న‌నే పెళ్ల‌యిన జంట‌... జీవితాన్ని రోమాంచితంగా ఎంజాయ్ చేస్తోంది. జీవితంలోని ర‌సాస్వాధ‌న‌లను ఏమాత్రం దాచుకోకుండా వారు ఓపెన‌వుతున్నారు. దీంతో ఈ జంట రొమాంటిక్ లైఫ్ ఇప్పుడు అభిమానుల్లో ఓపెన్ డిబేట్ గా మారింది.

ఇంత‌లోనే అత‌డు త‌న భార్య వ్య‌వ‌హారంపై ఓపెన‌య్యాడు. త‌న అనుమ‌తి లేకుండానే వేకువ‌ఝామున త‌న స‌తీమ‌ణి నిద్ర చెడ‌గొడుతోంద‌ని అంటున్నాడు. త‌న‌కు ఉద‌యం లేజీగా ఆల‌స్యంగా నిద్ర‌లేవ‌డం, కంటి నిండా కునుకు తీయ‌డం అల‌వాటు. కానీ ఆమె కోడి కూసే వేళ‌ నిద్ర లేపేస్తోంది. పైగా వేకువ‌ఝామున స‌న్ రైజ్ ని ఆస్వాధించాల‌ని, అది ఆరోగ్యానికి చాలా మంచిది అని కూడా చెబుతోంద‌ట‌. అయితే ఈ విష‌యాన్ని ఒక ఫిర్యాదులా కాకుండా ఎంతో ఫ‌న్నీ మ్యాన‌ర్ లో చెప్పాడు స‌ద‌రు కొంటె భ‌ర్త‌.

ఇంత‌కీ ఈ సెల‌బ్రిటీ ల‌వ్వ‌బుల్ క‌పుల్ ఎవ‌రో ప్రత్యేకంగా చెప్పాలా? నిస్సందేహంగా సిద్ధార్థ్- అదితీ రావ్ హైద‌రీ. హైద‌రాబాద్ (తెలంగాణ) న‌వాబుల మూలాలున్న అదితీరావుని ఇటీవ‌లే ప‌క్కా త‌మిళ‌బ్బాయి సిద్ధార్థ్ పెళ్లాడాడు. ఈ ఇరువురి సంస్కృతులు, సాంప్ర‌దాయాలు విభిన్న‌మైన‌వి. కానీ మ‌న‌సులు క‌లిసాయి. ఈ జంట కొన్నేళ్లుగా ప్రేమ‌లో ఉంది. ఆ ఇద్ద‌రికీ మొద‌టి పెళ్లితో గ‌తానుభ‌వాలున్నాయి. అయినా ఇప్పుడు ఈ కొత్త వైవాహిక జీవితంలో క‌ల‌ల‌తో ముందుకు సాగుతున్నారు. అంతేకాదు.. కొత్త‌గా పెళ్ల‌యిన జంట‌ల‌కు గోల్స్ సెట్ చేస్తూ రంజైన జీవితాన్ని ఆస్వాధించ‌డం ఎలానో నేర్పించ‌డం స‌ర్వ‌త్రా అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

సిధ్- అదితీ ఇద్ద‌రూ పెళ్లి త‌ర్వాత కూడా న‌ట‌నా కెరీర్ ని కొన‌సాగించ‌నున్నారు. సిద్ధార్థ్ ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి ప్రాజెక్టుల గురించి ఆలోచించేందుకు కొంత స‌మ‌యం తీసుకుంటున్నాడ‌ని తెలిసింది. అదితీ న‌టించిన చివ‌రి సినిమా `హీరామండి`కి సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అదితీ న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. ఈ భామ‌ త‌దుప‌రి సినిమా వివ‌రాలు వెల్ల‌డించాల్సి ఉంది.

Tags:    

Similar News