మరోసారి గాసిప్స్ లో చిక్కిన లవ్ బర్డ్స్
తాజాగా ఓ పబ్లిక్ ఈవెంట్ లో డార్క్ బ్లూ ఔట్ ఫిట్ , బ్రౌన్ ఫార్మల్ షూస్ ధరించి సిద్ధార్థ్.. డోనింగ్ బ్లాక్ కలర్ ప్యాంట్, వైట్ టాప్‌లో కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ ధరించి అదితి కనిపించారు.
హీరో సిద్ధార్థ్ - హీరోయిన్ అదితి రావ్ హైదరీ మరోసారి జంటగా కెమెరా కంటికి చిక్కారు. సిద్ధార్థ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ చిత్తా(తెలుగులో చిన్నా) రీసెంట్ గా రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఫ్యామిలీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాను మరింత జనాల్లోకి తీసుకెళ్లేందుకు వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సిద్ధార్థ్.. తాజాగా అదితితో కలిసి దర్శనమిచ్చారు.
వివరాళ్లోకి వెళితే... సిద్ధార్థ్ - అదితి మొదటి సారి మహాసముద్రం సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి ప్రేమలో పడ్డారని అంటుంటారు. గతంలో ఈ జంట కలిసి పలు వేడుకల్లో సన్నిహితంగా కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ ఈ లవ్ బర్డ్స్ మాత్రం తమ ప్రేమ వ్యవహారంపై నోరు విప్పలేదు. కానీ బయట మాత్రం కలిసి కనిపిస్తూనే ఉంటారు.
తాజాగా ఓ పబ్లిక్ ఈవెంట్ లో డార్క్ బ్లూ ఔట్ ఫిట్ , బ్రౌన్ ఫార్మల్ షూస్ ధరించి సిద్ధార్థ్.. డోనింగ్ బ్లాక్ కలర్ ప్యాంట్, వైట్ టాప్‌లో కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ ధరించి అదితి కనిపించారు. ఇద్దరు కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. తమ లుక్స్ తో ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అలా మరోసారి జంటగా ప్రేక్షకులకు కనిపించడంతో వీరిద్దరి డేటింగ్ రూమర్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి.
కాగా, మణిరత్నం చెలియా, నవాబ్ సినిమాలతో సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు చేరువైంది అదితి రావ్ హైదరీ. ఇంకా తెలుగులో సమ్మోహనం, వితో పాటు మహాసముద్రం సినిమాలు చేసింది. మరోవైపు బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాలతో టాలీవుడ్లో బిగ్ సక్సెస్‌లను అందుకున్నారు సిద్ధార్థ్. అయితే యూత్ ఆడియెన్స్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఆయన.. కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు.
కమర్షియల్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు సిద్ధార్థ్. అయితే తాజాగా చిత్తా సినిమాతో చెప్పుకోదగ్గ హిట్ అందుకున్నారు. ఈ సినిమాకు ఆయనే నిర్మాత కూడా కావడం మరో విశేషం.