అమెరికాలో బ‌ర్గ‌ర్లు అమ్మ‌డం ఇష్టం లేక న‌టుడిగా!

`డీజే టిల్లు`తో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ టాలీవుడ్ లో ఎంత ఫేమ‌స్ అయ్యాడో చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమా టైటిలే త‌న ఇంటి పేరుగా మారిపోయింది.;

Update: 2025-03-30 06:36 GMT
అమెరికాలో బ‌ర్గ‌ర్లు అమ్మ‌డం ఇష్టం లేక న‌టుడిగా!

`డీజే టిల్లు`తో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ టాలీవుడ్ లో ఎంత ఫేమ‌స్ అయ్యాడో చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమా టైటిలే త‌న ఇంటి పేరుగా మారిపోయింది. `డీజే టిల్లు`కు సీక్వెల్ గా `టిల్లు స్క్వేర్` కూడా తెర‌కెక్కించి ఏకంగా 100 కోట్ల క్ల‌బ్ లోనే చేరిపోయాడు. ఈ రెండు విజ‌యాలు సిద్దు జీవితాన్నే మార్చేసాయి. హీరోగా వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. `టిల్లు క్యూబ్` కూడా త్వ‌ర‌లో త‌యార‌వుతుంది.

ఈ సినిమా ఇంకా రిచ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా ఇప్పుడు ఈ సినిమాల కంటే ముందు సిద్దు చాలా సినిమాల్లో న‌టించాడు. కానీ ఆవేవి పెద్ద‌గా గుర్తింపు తీసుకురాలేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు. `జోష్` త‌ర్వాత చాలా సినిమాల్లో న‌టించాడు. అయితే త‌న‌లో రైటింగ్ స్క్రిల్స్ కూడా ఉండటంతో ఎద‌గ‌డంలో ఆ స్కిల్ కీల‌క పాత్ర పోషించింది. త‌న‌ని తానే స్టార్ గా తీర్చి దిద్దుకోగ‌లిగాడు.

బ్యాకెండ్ లో టీమ్ కూడా స‌హ‌క‌రించ‌డంతోనే ఇదంతా సాధ్య‌మైంది. అయితే న‌టుడి అవ్వ‌డం కంటే ముందు సిద్దు అందరిలో అమెరికా ఉద్యోగం చేయాల‌నుకున్నాడుట‌. బీటెక్ త‌ర్వాత క‌న్స‌ల్టెన్సీ కంపెనీకి 20 ల‌క్ష‌లు క‌డితే అమెరికా పంపుతామ‌ని..అక్క‌డే చ‌దువుకుంటూ చేసిన అప్పు తీర్చ‌డానికి బ‌ర్గర్ షాప్ లో ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని చెప్పారుట‌. కానీ బ‌ర్గ‌ర్ షాపులో ప‌నిచ‌య‌డం ఇష్టం లేక సినిమాల్లో ప్ర‌య‌త్నం చేద్దామ‌ని ఈ రంగంలోకి వ‌చ్చిన‌ట్లు తెలిపాడు.

ఒక‌వేళ బ‌ర్గ‌ర్లు అమ్మే ప‌రిస్థితి లేక‌పోయి ఉంటే సిద్దు అమెరికాలో మంచి ఉద్యోగం చేసుకుంటూ స్థిర‌ప‌డితే? టిల్లు బాబును తెలుగు ఆడియ‌న్స్ మిస్ అయ్యేవారు. ప్ర‌స్తుతం సిద్దు హీరోగా `తెలుసు క‌దా`, `జాక్` చిత్రాల్లో హీరోగా న‌టిస్తున్నాడు. రెండు సినిమాలు ఆన్ సెట్స్లోఉన్నాయి. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని ఇదే ఏడాది రిలీజ్ అవుతాయి.

Tags:    

Similar News