జాక్‌తో టాప్ లీగ్‌లోకి స్టార్ బాయ్ సిద్ధూ?
వరుసగా రెండు విజయాల తరువాత సిద్దూ జొన్నలగడ్డ నటించిన తాజా మూవీ `జాక్`. బొమ్మరిల్లు భాస్కర్ తొలిసారి తన పంథాకు పూర్తి భిన్నంగా చేసిన మూవీ ఇది.;

ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఇక్కడ రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతుంటాయి. స్టార్ బాయ్ సిద్దూ కెరీర్‌లోనూ అలాంటి మ్యాజిక్కే జరిగింది. `జోష్` మూవీలో క్రెడిట్ లేని పాత్రలో కాలేజీ స్టూడెంట్‌గా కనిపించిన సిద్దూ జొన్నలగడ్డకు స్టార్ బాయ్ అనిపించుకోవడానికి 13 ఏళ్లు పట్టింది. `డీజే` టిల్లు సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సిద్దూ ఈ సినిమాతో స్టార్ బాయ్ అనిపించుకున్నాడు. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
వరల్డ్ వైడ్‌గా రూ.30 కోట్లకు పైనేరాబట్టి సిద్దూను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యేలా చేసింది. ఆ తరువాత చేసిన `టిల్లు స్క్వేర్` కూడా భారీ లాభాల్ని అందించడంతో సిద్దూ హాట్ టాపిక్‌గా మారాడు. మినిమమ్ గ్యారంటీ హీరోల జాబితాలో చేరిపోయాడు. తెలంగాణ యాసలో సాగే టిల్లు క్యారెక్టర్ ఓ రేంజ్‌లో పేలడంతో తన నుంచి ఆడియన్స్ అదే తరహా సినిమాలని ఆశిస్తున్నారు. ఇండియావైడ్‌గా రూ.46 కోట్లు రాబట్టి సిద్దూ క్రేజ్ ఏంటో నిరూపించింది.
వరుసగా రెండు విజయాల తరువాత సిద్దూ జొన్నలగడ్డ నటించిన తాజా మూవీ `జాక్`. బొమ్మరిల్లు భాస్కర్ తొలిసారి తన పంథాకు పూర్తి భిన్నంగా చేసిన మూవీ ఇది. `బేబీ` ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ నెల 10న వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. టిల్లు తరహా క్యారెక్టర్‌తో రూపొందిన ఈ సినిమా కోసం సిద్దూ రూ.10 కోట్ల పారితోషికం డిమాండ్ చేశాడట. తనకున్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ అడిగినంత ఇచ్చేశారట.
`జాక్` అనుకున్నట్టుగా హిట్ అయితే సిద్దూ హ్యాట్రిక్ హిట్‌ని సొంతం చేసుకోవడం ఖాయం. ఇదే జరిగితే సిద్దూ టాప్ లీగ్‌లోకి వెళ్లడం లాంఛనమే. టీజర్‌తోనే క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ మూవీ రిలీజ్‌కు ముందే థియేట్రికల్ రైట్స్‌కు రూ.25 కోట్లకు అమ్ముడు పోయింది. నైజాం రూ. 9 కోట్లు, ఆంధ్రా, సీడెడ్ ఏరియాలకు కలిపి రూ.16 కోట్లకు అమ్ముడు పోయింది. క్రైమ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి అచ్చు రాజమణి, సామ్ సీఎస్, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.