సిద్ధు, నాగవంశీ.. పెద్ద డీలే!

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, ప్రముఖ నిర్మాత నాగవంశీ కాంబోకి ఎలాంటి క్రేజీ ఉందో అందరికీ తెలిసిందే.

Update: 2024-10-23 06:37 GMT

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, ప్రముఖ నిర్మాత నాగవంశీ కాంబోకి ఎలాంటి క్రేజీ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వీరి కలయికలో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. రెండేళ్ల క్రితం డీజే టిల్లు అదిరిపోయే రీతిలో సినీ ప్రియులను అలరించగా.. రీసెంట్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ అంతకుమించి మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు భారీ లాభాలు అందించింది. త్వరలో టిల్లు క్యూబ్ కూడా రానుంది.

ఇప్పటికే అందుకు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అదే సమయంలో ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు సిద్ధు. వరుస ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. వైవిధ్యమైన కథలు ఎంచుకుని దూసుకెళ్తున్నారు. నీరజ కోన దర్శకత్వంలో తెలుసు కదా టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు. అదే సమయంలో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జాక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండూ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి.

రీసెంట్ గా సిద్ధు.. మరో మూవీని విజయదశమి రోజు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. క్షణం వంటి కల్ట్ థ్రిల్లర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన రవికాంత్ పెరెపు డైరెక్షన్ లో కోహినూర్ చిత్రాన్ని ప్రకటించారు. ఇప్పటికే వీరి కాంబోలో కృష్ణ అండ్ హిజ్ లీల మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు సరికొత్త కథాంశంతో సోషియోఫాంటసీ డ్రామాగా కోహినూర్ తో రానున్నారు. ఈ సినిమాను కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.

అయితే కోహినూర్ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. దీంతో సితార బ్యానర్ పై సిద్ధు మొత్తం మూడు సినిమాలు చేయనున్నారన్నమాట. కోహినూర్ రెండు

భాగాలతో పాటు టిల్లు క్యూబ్ లో నటించనున్నారు. దీంతో ఈ మూడు ప్రాజెక్టులకు గాను.. సిద్ధుకు భారీ రెమ్యునరేషన్ అందనున్నట్లు తెలుస్తోంది. రికార్డు స్థాయిలో పారితోషికం ఇచ్చేందుకు నాగవంశీ ఇప్పటికే డీల్ ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఫుల్ ప్యాకేజీగా ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టిల్లు సిరీస్ చిత్రాలు తర్వాత.. ముందు.. అన్నట్లు సిద్ధు కెరీర్ మారిపోయిందని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. నాగవంశీ, సిద్ధు మధ్య పెద్ద డీలే ఖరారు అయినట్లు ఉందని చెబుతున్నారు. డిఫరెంట్ జోనర్లు ట్రై చేస్తూ.. సినీ ప్రియులను అలరిస్తున్న సిద్ధు జొన్నలగడ్డకు అది వర్తేనని అంటున్నారు. మొత్తానికి మన టిల్లు... తన అప్ కమింగ్ మూవీస్ తో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News