డీజే సిద్దుతో అట్లుంటది..!

సిద్దు జొన్నలగడ్డ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అవుతోంది. దాదాపు దశాబ్ద కాలం స్ట్రగుల్స్ చూసిన సిద్దుకు ఫైనల్‌గా 'డీజే టిల్లు' సినిమాతో హిట్‌ పడింది.;

Update: 2025-04-08 17:30 GMT
Siddu’s Funny Incident During DJ Tillu

సిద్దు జొన్నలగడ్డ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అవుతోంది. దాదాపు దశాబ్ద కాలం స్ట్రగుల్స్ చూసిన సిద్దుకు ఫైనల్‌గా 'డీజే టిల్లు' సినిమాతో హిట్‌ పడింది. యూత్‌లో ఒక్కసారిగా టిల్లు గాడు అంటూ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో వెంటనే టిల్లు స్క్వేర్‌ సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా నిర్మాత నాగ వంశీకి భారీ లాభాలు దక్కాయి. ప్రస్తుతం టిల్లు క్యూబ్‌ సినిమా కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో సిద్దు నటించిన జాక్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

'జాక్‌' సినిమా ప్రమోషన్‌ సమయంలో సిద్దు జొన్నలగడ్డ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. కెరీర్‌లో సక్సెస్‌ లేని సమయంలో చాలా మంది అవమానించారు అంటూ సిద్దు చెప్పుకొచ్చాడు. డీజే టిల్లు సినిమా షూటింగ్‌ సమయంలోనూ తాను కొన్ని సంఘటనలను ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చాడు. డీజే టిల్లు సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఆ సినిమాకి స్క్రిప్ట్‌, డైలాగ్స్‌ను సైతం సిద్దు అందించాడు. కీలక విషయాల్లో సిద్దు ఇన్వాల్వ్‌మెంట్‌ కీలకంగా ఉంటుంది. డీజే టిల్లు సినిమా విజయంలో ఎక్కువ శాతం క్రెడిట్ కచ్చితంగా సిద్దు జొన్నలగడ్డకు దక్కుతుంది అంటూ మేకర్స్‌ చెబుతూ ఉంటారు. ఆన్‌ లొకేషన్‌ డైలాగ్స్ ఇస్తూ వచ్చేవాడట.

తాజాగా సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ... డీజే టిల్లు షూటింగ్‌ సమయంలో నేను దర్శకుడు విమల్ పక్కన కూర్చుని గట్టిగా నవ్వుకుంటూ ఉన్నాం. అది చూసిన మేనేజర్‌ నిర్మాత నాగవంశీ కి ఫోన్ చేసి వీళ్లు షూటింగ్‌ మానేసి పక్కకు వెళ్లి నవ్వుకుంటున్నారు అని చెప్పాడట. నిర్మాతకు మేనేజర్‌ కంప్లైంట్ గురించి సిద్దు ఫన్నీగా చెప్పాడు. ఆ సమయంలో తాము ఏదో విషయం గురించి మాట్లాడుకోవడం లేదని, సినిమాలోని కీలక సన్నివేశంలో వచ్చే డైలాగ్‌ను అప్పటికప్పుడు రాస్తూ నవ్వుకున్నామని చెప్పుకొచ్చాడు. సినిమాలో నువ్వెళ్ల వాటర్‌ మిలాన్ ఆర్డర్‌ పెట్టుకుని చిల్‌ అవ్వు, ఈ శవాలను పాతి పెట్టడం నాకు అలవాటే అంటాడు హీరో.

ఆ డైలాగ్‌ను దర్శకుడు విమల్‌కి చెప్పిన సమయంలో అతడు ఎక్కువగా నవ్వాడు. అది చూసి మేనేజర్ తప్పుగా అర్థం చేసుకుని మేము షూటింగ్‌ మానేసుకుని జోకులు వేసుకుంటున్నామని అనుకున్నాడని సిద్దు చెప్పుకొచ్చాడు. సిద్దుకు అప్పట్లో అంతగా క్రేజ్ లేదు కనుక ఏం చేసినా మేనేజర్ నుంచి అందరూ ఆయన్ను కాస్త చిన్న చూపు చూసేవారు అని దీన్ని బట్టి చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సిద్దు చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. సమయస్ఫూర్తితో సిద్దు చేసే వ్యాఖ్యలు, ఆయన అప్పటికప్పుడు రాసే డైలాగ్స్ బాగుంటాయని ఆయనతో వర్క్‌ చేసేవారు అంటూ ఉంటారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన జాక్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందా అనేది చూడాలి.

Tags:    

Similar News