సిద్ధు.. వారితోనే మరొకటి

సిద్ధుతో రాబోయే కొత్త సినిమాకు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించబోతున్నాడు. వీరిద్దరి కలయికలో గతంలో 'కృష్ణ అండ్ హిజ్ లీలా' సినిమా వచ్చింది.

Update: 2024-10-11 07:55 GMT

డీజే టిల్లు చిత్రంతో యూత్‌లో మంచి క్రేజ్ అందుకున్న సిద్ధూ జొన్నలగడ్డ, తనదైన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ సినిమా తర్వాత తన ప్రత్యేకతను మరింత పెంచుకుని ఫ్యాన్స్‌లో అంచనాలు క్రియేట్ చేసిన సిద్ధూ, ఇప్పుడు మరో కొత్త సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్టులు లైన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇక అవి షూటింగ్ దశలో ఉండగానే మరికొన్ని కొత్త కథలు వింటున్నాడు.

టాలెంటెడ్ దర్శకులు వస్తే ఏమాత్రం నో చెప్పడం లేదు. స్టోరీ లైన్ ఏమాత్రం నచ్చినా కూడా వారితో ట్రావెల్ అవుతూ మంచి స్క్రిప్ట్ సెట్టయ్యేలా సపోర్ట్ చేస్తున్నాడు. ఇక మరోసారి సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో సిద్ధూ కొత్త ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రాబోతోంది. ఈ సంస్థలో సిద్ధు చేసిన DJ టిల్లు, టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అందుకే సితార వాళ్ళు సిద్ధుని వదలడం లేదు.

సిద్ధుతో రాబోయే కొత్త సినిమాకు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించబోతున్నాడు. వీరిద్దరి కలయికలో గతంలో 'కృష్ణ అండ్ హిజ్ లీలా' సినిమా వచ్చింది. ఆ సినిమా ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు అదే కాంబో మళ్ళీ తెరపైకి వస్తుండటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.ఈ కొత్త ప్రాజెక్ట్ కథాంశం, గత ప్రాజెక్ట్స్‌తో పోలిస్తే భిన్నంగా, మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందట. రవికాంత్ పేరెపు ఇప్పటికే తన అనుభవాన్ని 'క్షణం' వంటి చిత్రాలతో ప్రూవ్ చేసుకున్నారు.

'బబుల్గమ్', 'కృష్ణ అండ్ హిజ్ లీలా'తో ఆయన దర్శకత్వంలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు సిద్ధూ మరియు రవికాంత్ కలయికలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింతగా పెరిగింది. ఇప్పటికే సిద్ధూ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. 'జాక్' మరియు 'తెలుసు కదా' పేరుతో సిద్ధూ చేస్తున్న ఈ సినిమాలు పూర్తికాగానే రవికాంత్ తో ఈ కొత్త ప్రాజెక్ట్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతున్నారు.

కొత్తగా రాబోతున్న ఈ మైథలాజికల్ చిత్రంలో సిద్ధూ ఏ పాత్రలో కనిపించబోతారనేది ప్రస్తుతం ఆసక్తికరమైన అంశంగా ఉంది. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సినిమా వస్తోంది అంటే తప్పకుండా అది న్యూ కంటెంట్ తో ఉంటుందని చెప్పవచ్చు. అలాగే సిద్ధు త్వరలోనే మరో రెండు కథలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News