టిల్లు స్క్వేర్.. లాస్ట్ వరకు చేంజ్ చేస్తూనే..
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన కామెడీ టైమింగ్ తో మరోసారి అలరించారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు
రెండేళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ అయిన డీజే టిల్లు మూవీతో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. సిద్ధు యాక్టింగ్, యాటిట్యూడ్ తో పాటు స్టైల్ కు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పటికీ డీజే టిల్లు సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఈ సినిమా సీక్వెల్ టిల్లు స్క్వేర్ రిలీజైన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం.. మంచి టాక్ దక్కించుకుని దూసుకుపోతోంది.
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన కామెడీ టైమింగ్ తో మరోసారి అలరించారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. టిల్లు గాడి పంచ్ డైలాగ్స్ మంచి గా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. సిద్ధు వన్ మెన్ షోగా కొనియాడుతున్నారు. ఈ సినిమా ఫుల్ ఫన్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెబుతున్నారు. ఈ మూవీలో హీరోగా నటిస్తూనే రచయితగా కూడా సిద్ధు జొన్నలగడ్డ వ్యవహరించిన విషయం తెలిసిందే.
అయితే కొందరు హీరోలు.. తమ సినిమాల స్క్రిప్ట్ విషయంలో జోక్యం చేసుకుంటారని వార్తలు వస్తుంటాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధుకు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. మూవీల్లో ఎంతవరకు జోక్యం చేసుకుంటారని అడగ్గా.. టిల్లు స్క్వేర్ మూవీకి తానే రచయిత, కాబట్టి ప్రతి విషయంలో తాను జోక్యం చేసుకున్నట్లు తెలిపారు సిద్ధు. మూవీ లాస్ట్ వరకు ఛేంజెస్ చేశానని చెప్పారు. మధ్యలో డైలాగ్స్ కూడా యాడ్ చేశానని వెల్లడించారు.
ఈ సినిమా విషయంలో పూర్తిగా రైటింగ్, మేకింగ్ లో కంప్లీట్ ఫ్రీడమ్ తీసుకున్నానని, కొన్ని సీన్లు రీషూట్ కూడా చేశామని తెలిపారు. తన అప్ కమింగ్ మూవీల్లో కేవలం నటిస్తున్నానని, జోక్యం చేసుకోనని క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా ఇండస్ట్రీలోని ప్రతి దర్శకుడికి సినిమాలోని క్యారెక్టర్ పై పెర్ఫెక్ట్ విజన్ ఉంటుందని తెలిపారు. దాన్ని హీరో ఫాలో అవ్వాలని, నేను కూడా అదే చేస్తున్నట్లు చెప్పారు.
తన కొత్త చిత్రాల విషయంలో ఫ్యాన్స్ అభిప్రాయాలను లెక్కలోకి తీసుకుని అడుగులేస్తున్నట్లు చెప్పారు సిద్ధు. నీరజ కోన డైరెక్షన్ లో ప్యూర్ లవ్ స్టోరీ చేస్తున్నానని సృష్టం చేశారు. ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ పరంగా బెస్ట్ పొజిషన్ లోనే ఉన్నట్లు వెల్లడించారు. కానీ ఎంతనేది చెప్పలేదు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో కూడా సిద్ధు మరో సినిమా చేస్తున్నారు. మరి స్టార్ బాయ్ కొత్త చిత్రాలు ఎలా ఉంటాయో చూడాలి.