టాలీవుడ్ లో సౌత్ ఇండియా ఫిలిం పెస్టివల్!
ఈ ఉత్సవంలో భాగంగా సినిమాల ప్రదర్శనతో పాటు..గ్రూప్ డిస్కషన్స్..షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్..ప్యానెల్ డిస్కషన్స్ జరుగుతాయి.
ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా దిగ్విజయంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆహా సంస్థ- నిర్మాణ సంస్థ పీపూల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సౌత్ ఇండియా ఫిలిం పెస్టివల్స్ నిర్వహిస్తుంది. ఈ ఉత్సవంలో భాగంగా సినిమాల ప్రదర్శనతో పాటు..గ్రూప్ డిస్కషన్స్..షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్..ప్యానెల్ డిస్కషన్స్ జరుగుతాయి. నవతరం ప్రతిభావంతుల్ని ప్రోత్సహించేదుకు ఈ వేడుక నిర్వహిస్తున్నారు.
ఈ ఫిలిం పెస్టివల్స్ లో పాల్గొనే వారిని మూడు విభాగాలుగా విభజించారు. 3-15 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలిం. రెండవ విభాగంలో షార్స్ట్ షార్ట్ గా మూడు నిమిషాలకంటే తక్కువగా ఉండాలి. అలాగే మ్యూజిక్ విభాగం నుంచి ఐదు నిమిషాల కంటే తక్కువగా ఉండే వీడియో ఉండాలి. 2020 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 10 మధ్యన వచ్చిన సినిమాల కంటెంట్ తో వీడియో చిత్రీకరించి ఉండాలి.
ఈ పెస్టివల్ కేవలం తెలుగులోనే నిర్వహిస్తున్నారు. భవిష్యత్ లో ఇతర సౌత్ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. కొంత మంది తెలుగు దర్శకులు జ్యూరీ సభ్యులుగా ఉంటారు. జీవితా రాజశేఖర్- హరీష్ శంకర్- విఎన్ ఆదిత్య- చందు మొండేటి- సాయి రాజేష్-ఇండియన్ టెలివిజన్ చీఫ్ ఎడిటర్ గా పనిచేసిన అనిల్ వాన్వరి మెంబర్లగా ఉన్నారు. డిసెంబర్ 20 నుంచి ఈ వేడుకలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియాకి చెందిన సెలబ్రిటీలు పాల్గొంటారు.
నవతరం ప్రతిభావంతులకు ఇది మంచి అవకాశం. తమ ప్రతిభని చాటుకునే చక్కని అవకాశం ఇది. వెబ్ సిరీస్ లు ఇప్పటికే కొత్త వారికి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఓటీటీలో సక్సస్ అయిన వారంతా సినిమాలకు ప్రమోట్ అవుతున్నారు. గతంలో పూరిజగన్నాధ్ ఇలాంటి కాంటెస్ట్ ఒకటి నిర్వహించారు. కానీ అది పెద్ద సక్సెస్ అవ్వలేదు. ఈసారి నేరుగా అల్లు అరవింద్ కి చెందిన ఆహా రంగంలోకి దిగింది కాబట్టి ప్రతిష్టాత్మ కంగానే ఉంటుందని చెప్పొచ్చు.