`పుష్ప 2`లో మూడో వంతు అయినా?

స‌ల్మాన్ ఖాన్ న‌టించిన `సికంద‌ర్` ఈద్ కానుక‌గా ఈ నెల 28న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. శుక్ర‌వారం నాడు రిలీజ‌వుతున్న ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో(శుక్ర‌,శ‌ని,ఆది) సుమారు 200 కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా.;

Update: 2025-03-16 11:36 GMT

స‌ల్మాన్ ఖాన్ న‌టించిన `సికంద‌ర్` ఈద్ కానుక‌గా ఈ నెల 28న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. శుక్ర‌వారం నాడు రిలీజ‌వుతున్న ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో(శుక్ర‌,శ‌ని,ఆది) సుమారు 200 కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా. ఈ సినిమాని ఏ.ఆర్.మురుగ‌దాస్ భారీ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తీర్చిదిద్దార‌ని ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజైన పోస్ట‌ర్లు టీజ‌ర్లు చెబుతున్నాయి. ఇది మాస్ లో కొంత ఊపు తెచ్చే వీలుంది.

అయితే ఈ సినిమాకి ప్ర‌చారం ప‌రంగా అంత హైప్ లేదు. భాయ్ మునుప‌టిలా జ‌నాల్ని అట్రాక్ట్ చేయ‌డం లేదు. దీంతో మొద‌టి రోజు సికంద‌ర్ 100 కోట్లు వ‌సూలు చేయ‌గ‌ల‌డా? అనేది సందిగ్ధంగా ఉంది. ఒక అంచ‌నా ప్ర‌కారం.. సికంద‌ర్ సుమారు 60-70 కోట్లు వ‌సూలు చేసే ఛాన్సుంది. అయితే పాన్ ఇండియ‌న్ ట్రెండ్ లో ఈ వ‌సూళ్లు ఒక పెద్ద సూప‌ర్ స్టార్ కి చాలా త‌క్కువ‌. మొద‌టి రోజు 100 కోట్ల క్ల‌బ్ లో చేరిన వారిలో అర‌డ‌జ‌ను పైగా సూప‌ర్ స్టార్లు ఉన్నారు. వారి జాబితాను ప‌రిశీలిస్తే.. అల్లు అర్జున్ ఇటీవ‌ల పుష్ప 2తో ఓపెనింగ్ డే వ‌సూళ్ల‌లో సంచ‌ల‌నం సృష్టించాడు. పుష్ప 2 మొద‌టి రోజు ఏకంగా 175 కోట్ల ప్ర‌పంచ‌వ్యాప్త వ‌సూళ్ల‌ను సాధించింది.

మొద‌టి రోజు 100 కోట్ల క్ల‌బ్ సాధించిన స్టార్ల‌లో ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్, య‌ష్ కూడా ఉన్నారు. ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి 2, సాహో, స‌లార్, ఆదిపురుష్‌, క‌ల్కి 2898 ఏడి చిత్రాలు 100 కోట్ల‌తో ఓపెనింగ్ డే అద‌ర‌గొట్టాయి. అలాగే చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తో ఇది సాధించ‌గా, య‌ష్ కేజీఎఫ్ 2తో ఓపెనింగుల్లో ఈ క్ల‌బ్ ని అందుకున్నాడు. అయితే బాలీవుడ్ నుంచి షారూఖ్ జ‌వాన్- ప‌ఠాన్ చిత్రాల‌తో ఈ ఫీట్ సాధించ‌గా, యానిమ‌ల్ తో ర‌ణ‌బీర్ కూడా 100కోట్ల డే1 ఓపెనింగ్ క్ల‌బ్ లో చేరాడు. అటు త‌మిళంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ గోట్ చిత్రంతో 100కోట్ల ఓపెనింగ్ క్ల‌బ్ లో చేరాడు. అయితే సికంద‌ర్ లో అంత జోరు క‌నిపించ‌డం లేదు. ఈ సినిమా కేవ‌లం 60-70 కోట్ల మేర మొద‌టి రోజు వ‌సూలు చేస్తుందని అంచ‌నా.

టికెట్ సేల్ లో నం.1 ఎవ‌రు?

ఇక టికెట్ సేల్ ప‌రంగా చూస్తే పుష్ప 2 చిత్రం 6.30 కోట్ల టికెట్లు సేల్ అయ్యాయి. కోవిడ్ అనంతర కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్, ప్రభాస్ కల్కి 2898 ఎడి, షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలను పుష్ప 2 అధిగమించింది. దాదాపు 6.30-6.50 కోట్ల టిక్కెట్ల అమ్మకాలు జరిగాయి. మరే ఇతర భారతీయ సినిమా కూడా ఆరు కోట్ల మార్కును సాధించలేకపోయింది.

Tags:    

Similar News